Friday, February 28, 2025

ఢిల్లీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా మోహన్ సింగ్ బిష్త్

- Advertisement -
- Advertisement -

ఆరుసార్లు బిజెపి ఎంఎల్‌ఏగా ఉన్న మోహన్ సింగ్ బిష్త్(67) గురువారం ఢిల్లీ అసెంబ్లీకి డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఆయన పేరును ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రతిపాదించారు. ప్రతిపాద తీర్మానాన్ని పర్యావరణ శాఖ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా బలపరిచారు. కాగా అనిల్ కుమార్ శర్మ ప్రతిపాదించిన రెండవ తీర్మానాన్ని గజేందర్ సింగ్ యాదవ్ బలపరిచారు. ప్రముఖ బిజెపి నాయకుడైన బిష్త్ ముస్తఫాబాద్ నుంచి ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు.

ఆయన ఆప్ అభ్యర్థి అయిన ఆదిల్ అహ్మద్ ఖాన్‌ను 17000 ఓట్లతో ఓడించారు. బిష్త్ ఇదివరలో 1998 నుంచి 2015 వరకు కరావల్ నగర్‌కు ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత మళ్లీ 2020లో గెలుపొందారు. ఆమ్ ఆద్మీ పార్టీ దశాబ్ద కాలం పాలన తర్వాత బిజెపి ఇటీవల ఢిల్లీ పీఠాన్ని దక్కించుకుంది. ఢిల్లీ 70 సీట్లలో బిజెపి 48 గెలుచుకుంది. కాగా ఆప్‌కు కేవలం 22 సీట్లు దక్కాయి. కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News