Sunday, December 22, 2024

బిజెపిపై విషం కక్కే ప్రయత్నం.. ఈటల సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వరంగల్ లో ప్రధాని నరేంద్ర మోడీ సభను విజయవంతం చేస్తామని బిజెపి ఎంఎల్ఏ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. బిజెపిపై విషం కక్కేప్రయత్నం చేస్తున్నారని ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ గడ్డపై మా విజయపరంపర 2019 ఎన్నికలతో మొదలైందని ఆయన స్పష్టం చేశారు. దుబ్బాక, హుజూరాబాద్, జిహెచ్ఎంసి ఎన్నికల్లో సత్తాచాటామని ఈటల వెల్లడించారు. మునుగోడులోనూ నైతికంగా బిజెపినే గెలిచిందని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి జండా ఎగరవేస్తామని ఈటల దీమా వ్యక్తం చేశారు. బిజెపి, బిఆర్ఎస్ ఒక్కటయ్యాయని దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కార్యకర్తలు ఇలాంటి వార్తలను నమ్మెద్దని ఆయన సూచించారు. చాపకింద నీరులా మా పార్టీ రాష్ట్రంలో విస్తరిస్తోందని ఈటల రాజేందర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News