Monday, December 23, 2024

రూ 40 లక్షల లంచం కేసు.. బిజెపి ఎంఎల్ఎ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : కర్నాటకలో బిజెపి ఎంఎల్ఎ మదల్ విరూపాక్షప్ప ముడుపుల కేసులో అరెస్టు అయ్యారు. కర్నాటక సోప్స్, డిటర్జెంట్ లిమిటెడ్ (కెఎస్‌డిఎల్) ఛైర్మన్ పదవి నుంచి వైదొలిగారు. ఎంఎల్ఎ ను లోకాయుక్త పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లంచం తీసుకుంటూ ఈ ఎంఎల్ఎ కుమారుడు, ప్రభుత్వాధికారి అయిన ప్రశాంత్ మదల్ పట్టుబడటం, తండ్రి తరఫున తాను లంచం తీసుకోవల్సి వచ్చిందని అంగీకరించడంతో ఇప్పుడు ఎమ్మెల్యే అరెస్టు జరిగింది. చాలారోజులుగా అరెస్టు కాకుండా తప్పించుకుని తిరుగుతున్న ఈ ఎంఎల్ఎ ఇంతకు ముందటి యాంటిసిపేటరీ బెయిల్‌ను రాష్ట్ర హైకోర్టు సోమవారం కొట్టివేసింది. దీనితో ఆయన అరెస్టు చోటుచేసుకుంది.

ఎంఎల్ఎకు ఇంతకు ముందు దక్కిన బెయిల్‌ను హైకోర్టు రద్దు చేసింది. తిరిగి దరఖాస్తు చేసుకోగా దీనిని కొట్టివేసిన దశలో ఆయనను సోమవారం తూమకూరు రోడ్డు వద్ద క్యతసంద్ర టోల్‌గేట్ వద్ద లోకాయుక్త పోలీసులు తమకు అందిచన సమాచారం మేరకు కాపు కాసి వలేసి పట్టుకున్నారు. దావణగేరే జిల్లా నుంచి ఆయన బెంగళూరుకు వెళ్లుతూ ఉండగా అరెస్టు జరిగింది. కర్నాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్‌కు ముడిసరుకు సరఫరాల సంబంధించి తండ్రి తరఫున కొడుకు లంచాలు తీసుకున్నట్లు గుర్తించారు. రూ 40 లక్షల లంచం ఘటన సందర్భంగా జరిగిన తనిఖీలలో ఎంఎల్ఎ ఇంటి నుంచి గుట్టలుగుట్టలుగా దొరికిన నగదు రూ 8 కోట్లుగా ఉండటం సంచలనానికి దారితీసింది. అయితే ఛన్నాగిరి ఎంఎల్ఎ అయిన విరూపాక్షప్ప ఇది సక్రమ సొమ్ము అని, వక్కల పంట విక్రయాలతో వచ్చిందే అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News