Monday, December 23, 2024

బీజేపీ ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

కర్ణాటకలోని రామ్‌నగర్ జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మునిరత్నపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. బుధవారం రాత్రి రామ్‌నగర్ జిల్లా కగ్గలిపుర పోలీస్ స్టేషన్‌లో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. IPC సెక్షన్లు 354A, 354C, 376, 506, 504, 120(b), 149, 384, 406, 308 కింద FIR దాఖలు చేశారు. ఈ కేసులో బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నతో పాటు విజయ్ కుమార్, సుధాకర, కిరణ్ కుమార్, లోహిత్ గౌడ, మంజునాథ్, లోకీ సహా ఆరుగురిపై అభియోగాలు నమోదయ్యాయి. ఫిర్యాదులో పేర్కొన్న ప్రకారం కగ్గలిపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో ఈ వేధింపుల ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

కాగా, ఇప్పటికే మునిరత్న జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. కాంట్రాక్టర్‌ను బెదిరించిన కేసులో మునిరత్నను బెంగళూరు అరెస్టు చేశారు.దీంతో ఆయన వేసిన బెయిల్ పిటిషన్‌ను ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు గురువారం (సెప్టెంబర్ 19న) విచారించనుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ బెయిల్ మంజూరు చేస్తే జైలు దగ్గరే ఆయనను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే బెయిల్‌ తిరస్కరణకు గురైతే కగ్గలిపుర పోలీసులు బాడీ వారెంట్‌ దాఖలు చేసి ప్రొసీజర్‌ ప్రకారం అదుపులోకి తీసుకుంటారు. బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) కాంట్రాక్టర్‌ను బెదిరించినందుకు మునిరత్నను బెంగళూరు పోలీసులు సెప్టెంబర్ 14 రాత్రి అదుపులోకి తీసుకున్నారు.

కోలార్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) బి నిఖిల్ తెలిపిన వివరాల ప్రకారం.. మునిరత్న ఆంధ్రప్రదేశ్‌కు వెళుతుండగా కోలార్ పోలీసుల సహాయంతో బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోలార్ సమీపంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. మునిరత్నపై వైయాలికావల్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. మునిరత్నపై వేధింపులు, బెదిరింపులకు పాల్పడ్డారని కాంట్రాక్టర్‌ చెల్వరాజు చేసిన ఫిర్యాదు మేరకు ఈ కేసులు నమోదయ్యాయి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News