Saturday, November 16, 2024

త్రిపుర అసెంబ్లీలో ‘నీలి ’నీడలు

- Advertisement -
- Advertisement -

అగర్తలా : త్రిపుర అసెంబ్లీలో బిజెపి ఎమ్మెల్యే జబాద్ లాల్‌నాథ్ సెల్‌లో నీలి అశ్లీల చిత్రాలను చూడడం తీవ్రగందరగోళానికి ఐదుగురు ఎమ్మెల్యేల సస్పెన్షన్‌కు దారితీసింది. శుక్రవారం సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష నేత అనిమేష్ దెబ్బర్మ బిజెపి ఎమ్మెల్యే వ్యవహారాన్ని ప్రస్తావించారు. సభలో నీలి చిత్రాలు చూడడం ఏం పద్ధతి అని ప్రశ్నించారు. మార్చినెలలో బిజెపి ఎమ్మెల్యే వ్యవహారం చోటుచేసుకుంది. దీని గురించి ముందు చర్చించాల్సి ఉందని ప్రతిపక్షం పట్టుపట్టింది. అయితే ముందు ముఖ్యమైన ఇతర విషయాలను చేపట్టాల్సి ఉంటుందని స్పీకర్ బిస్వాబంధు సేన్ తెలిపారు. ఈ దశలో బిజెపి, తిప్రా మోతా ఎమ్మెల్యేల మధ్య పెద్ద ఎత్తున వ్యాగ్యుద్ధం సాగింది. సభా కార్యక్రమాలను అడ్డుకొంటున్నారని స్పీకర్ ఐదుగురు సభ్యులను బహిష్కరించారు.

దీనితో ఆగ్రహించిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వెల్‌లోకి దూసుకుపోవడం, ఓ సభ్యుడు అధికార పార్టీ ఎమ్మెల్యేను తిడుతూ టేబుల్‌పైకి ఎక్కడంతొ పరిస్థితి చేయిదాటింది. సభ నుంచి స్పీకర్ సిపిఎం, కాంగ్రెస్, తిప్రా మోతా ఎమ్మెల్యేలను బహిష్కరించడం పెను దుమారానికి దారితీసింది. ప్రతిపక్షాలు వాకౌట్ జరిపాయి. అసెంబ్లీలో శుక్రవారం నాటి పరిస్థితిపై ముఖ్యమంత్రి మాణిక్ సాహా తీవ్రంగా స్పందించారు. సభ బడ్జెట్ సెషన్ రోజే జరిగిన పరిణామాలు అనుచితంగా ఉన్నాయని తెలిపారు. అసెంబ్లీ పవిత్రమైన ప్రదేశం, ప్రజాస్వామ్య దేవాలయం, ఇక్కడ ఈ విధంగా సభ్యులు చెలరేగడం , వారి నిరసన తీరు పూర్తిగా పాపపు చర్యనే అవుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News