- Advertisement -
న్యూఢిల్లీ : రాహుల్ గాంధీకి జైలు సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన అంశంపై గుజరాత్‌కు చెందిన బిజెపి ఎమ్మెల్యే పూర్ణేషు మోడీ శుక్రవారం స్పందించారు. ఈ రూలింగ్‌ను తాను స్వాగతిస్తానని, అయితే సెషన్ కోర్టులో తన న్యాయపోరు సాగిస్తానని తెలిపారు. మోడీ ఇంటిపేరుపై రాహుల్ గాంధీ వ్యాఖ్యకు వ్యతిరేకంగా పూర్ణేషు మోడీనే ఆయనపై క్రిమినల్ పరువునష్టం దావా కేసు వేశారు.
ఈ కేసులో సుప్రీంకోర్టులో రాహుల్‌కు ఊరట దక్కింది. స్టే ఆదేశాలకు వ్యతిరేకం కాదని, అయితే రాహుల్ దురహంకార మాటలపై తన పోరు ఆగబోదని ప్రకటించారు. సుప్రీంకోర్టులో రాహుల్ అప్పీల్‌ను తిరస్కరించాలని బిజెపి ఎమ్మెల్యే కోరారు. మోడీ ఇంటిపేరు ఉన్న వారందరిని రాహుల్ తన మాటలతో కించపర్చినట్లు, ఇది గుజరాత్‌లోని యావత్తూ మోధ్ వణిక్ కులాన్ని అవహేళన చేసినట్లే అవుతుందన్నారు.
- Advertisement -