Sunday, December 22, 2024

దారినపోయే దానయ్య ఫిర్యాదు చేస్తే.. బిసి మంత్రిని ఎలా తీసేశారు?

- Advertisement -
- Advertisement -

దళితబంధుపై కెసిఆర్ వ్యాఖ్యలను హైకోర్టు సుమోటోగా తీసుకోవాలి

హైదరాబాద్: తెలంగాణ సర్కార్ పై దుబ్బాక బిజెపి ఎంఎల్ఏ రఘునందన్‌ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మీద ఆరోపణలపై ముఖ్యమంత్రి కెసిఆర్ ఎందుకు స్పందించాలేదు, దారినపోయే దానయ్య ఫిర్యాదు చేస్తే బిసి మంత్రిని ఎలా తీసేశారు? అని రఘునందన్ ప్రశ్నించారు. అవినీతి పేరుతో దళిత బిడ్డను మంత్రి పదవి నుంచి తొలగించారని ఆయన ఆరోపించారు. బలహీనవర్గాలకు ఒక న్యాయం… ఉన్నత వర్గాలకు మరో న్యాయామా? అన్నారు. దళిత బంధులో దోపిడీ గురించి చెప్పినా పట్టించుకోలేదని విమర్శించారు. దళితబంధుపై కెసిఆర్ వ్యాఖ్యలను హైకోర్టు సుమోటోగా తీసుకోవాలని ఆయన కోరారు. అవినీతికి పాల్పడ్డ ఎమ్మెల్యేల చిట్టా ఎసిబికి ఇవ్వాలని ఆయన కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News