Monday, December 23, 2024

బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

BJP MLA Raja Singh Arrested In Hyderabad

హైదరాబాద్: గోషామహల్ బిజెపి ఎంఎల్ఏ రాజాసింగ్ ను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. దీంతో రాజాసింగ్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజాసింగ్ ఇంటి వద్ద పోలీసులు బలగాలు భారీగా చేరుకున్నాయి. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో రాజాసింగ్ కు ఇప్పటికే పోలీసులు నోటీసులు జారీచేశారు. షాహినాయత్ గంజ్, మంగళ్ హాట్ కేసులకు సంబంధించి రాజాసింగ్ కు 41 సిఆర్పిసి కింద పోలీసులు నోటీసులిచ్చారు. 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని మంగళ్ హాట్ పోలీసులు కోరారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఘర్షణ వాతావరణం నెలకొన్న కారణంగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. రాజాసింగ్ ఇంటికి వెళ్లే దారిలో పోలీసులు బారీకేడ్లు వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News