హైదరాబాద్: గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహమ్మద్ ప్రవక్త(స)ను కించపరిచే విధంగా రాజాసింగ్ వీడియోను విడుదల చేయడం వివాదాస్పదంగా మారింది. 10 నిమిషాల 27 సెకండ్ల వీడియో అది. దానిని ‘శ్రీరామ్ ఛానెల్ తెలంగాణ’లో అప్ లోడ్ చేశారు. ఓ 53 ఏళ్ల వ్యక్తి 6 ఏళ్ల బాలికను పెళ్లాడాడని పరోక్షంగా హేళన చేసినట్లు తెలుస్తోంది. ఆ వీడియో సోమవారం వెలువడ్డాక బషీర్ బాగ్ లోని హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శనలు చోటుచేసుకున్నాయి. కాగా ముజ్లిస్ నేతలు తమ మత మనోభావాలను కించపరిచే విధంగా రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఈక్రమంలో అర్ధరాత్రి నగర పోలీసు కమిషనర్ సివి ఆనంద్ కార్యాలయం ముందు, పట్టణంలోని ఇతర ప్రాంతాలలో మజ్లీస్ నేతలు బైఠాయింపు నిరసనలకు దిగారు. రాజాసింగ్‌ను అరెస్ట్ చేయాలంటూ పలుపోలీస్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. కాంగ్రెస్ నేత రషీద్ ఖాన్ నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బలాలా తన మద్దతుదారులతో ఫిర్యాదు చేసేందుకు దబీర్‌పురా పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. రాజా సింగ్‌కు వ్యతిరేకంగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ వద్ద సుమారు 300 మంది నిరసన తెలిపారు. భవానీనగర్, డబీర్‌పురా, రెయిన్ బజార్ పిఎస్‌లలో ఫిర్యాదులు చేయడంతో రాజాసింగ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు తెలుస్తోంది. రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో పాతబస్తీలో ఉద్రిక్తత నెలకొంది.
Telangana Police detains BJP MLA Raja Singh for his alleged derogatory comments against Prophet Muhammad https://t.co/wZrwhIX1D1 pic.twitter.com/e4kkvM10ZQ
— ANI (@ANI) August 23, 2022