Monday, December 23, 2024

ఆలయాన్ని కూలుస్తామంటే చేతులు ముడుచుకొని కూర్చోము: రాజా సింగ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పాతబస్తీ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం విషయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తుండటం సిగ్గు చేటు అని శాసనసభాపక్ష నేత రాజా సింగ్ మండిపడ్డారు. ఇంకోవైపు ఆలయం వద్దకు వెళ్లి పూజలు చేస్తున్నారని, ఇంతకంటే సిగ్గు చేటేముంది? కాంగ్రెస్ నేతల ద్వంద్వ వైఖరికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? అని అడిగారు.

భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం విషయంలో ఏనాడూ తాము రాజకీయాలు చేయలేదని, అమ్మవారి విశిష్టత, గొప్పతనాన్ని తాము చాటి చెబుతుంటే అందుకు భిన్నంగా ఆలయాన్ని కూల్చేస్తామన్నడం సరికాదన్నారు.  అక్కడే నమాజ్ చేస్తామంటూ రాజకీయాలు చేస్తూ కాంగ్రెస్ నేతలు రెచ్చగొడుతున్నారని, ఆలయాన్ని కూలుస్తామంటే చేతులు ముడుచుకొని కూర్చుంటామా? అని నిలదీశారు. భాగ్యలక్ష్మీ అమ్మవారి శక్తిని, విశిష్టతను ప్రపంచానికి చాటిచెబుతున్న మా పార్టీ అధ్యక్షులు, ఎంపి బండి సంజయ్ కుమార్ పై మాట్లాడే నైతిక అర్హత కాంగ్రెస్ నేతలకు లేదన్నారు.

 అమ్మవారి ఆలయాన్ని కూలుస్తామన్న నేతలపై కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు చర్యలు తీసుకోకుండా సిగ్గులేకుండా బిజెపిపై ఎదురుదాడి ఎందుకు చేస్తున్నారని రాజాసింగ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతల తీరును చూసి జనం నవ్వుకుంటున్నారని, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ద్వంద్వ విధానాలను పక్కన పెట్టాలని సూచించారు. భాగ్యలక్ష్మీ అమ్మవారిపైనా, అక్కడే నమాజ్ చేస్తామంటూ రెచ్చగొడుతున్న వారిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News