హైదరాబాద్: రియాల్టీ గేమ్ షో బిగ్‌బాస్ షోను బ్యాన్ చేయాలంటూ బిజెపి ఎంఎల్ఎ రాజాసింగ్ డిమాండ్ చేశారు. బిగ్ బాస్‌పై విమర్శలు ఎక్కువవుతున్నాయి. బిగ్ బాస్ షోను వ్యతిరేకిస్తున్న రాజకీయ నాయకులు పెరిగిపోతున్నారు. ఈ షోను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. సిపిఐ నేత నారాయణ బిగ్ బాస్ గేమ్ షోను తీవ్రంగా వ్యతిరేకించారు. తాజాగా ఎంఎల్ఎ రాజాసింగ్ బిగ్ బాస్‌పై స్పందించారు. తెలంగాణలో బిగ్ బాస్ గేమ్ షోను బ్యాన్ చేయాలి.. అసలు ఆ షోలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదంటూ ఫైర్ అయ్యారు. యాంకర్ రవి ఎలిమినేట్ అయ్యి బయటకు రావడంతో ఏదో జరిగిందన్నారు. రవి విషయంలో ఏం జరిగిందో, అది బయటకు రావాలని కామెంట్ చేశారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో ఆంధ్రా, తెలంగాణ ఫీలింగ్స్ తెచ్చి రెచ్చగొడుతున్నారని రాజాసింగ్ ఆరోపించారు. గత రాత్రి అన్నపూర్ణ స్టూడియో దగ్గర కొందరు రచ్చ రచ్చ చేశారు. అసలు బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లి ప్రజలకు ఏం మెసేజ్‌లు ఇస్తున్నారంటూ ప్రశ్నించారు. చిన్న పిల్లలు, మహిళలు బిగ్ బాస్ కంటెంట్ చూడలేకపోతున్నారని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. బిగ్ బాస్ షోకి సైతం సెన్సార్ ఉండాల్సిందేనన్నారు. హిందూ దేవుళ్లను సైతం బిగ్ బాస్‌లో కించపరుస్తున్నారని ఆరోపించారు. బిగ్ బాస్ షోను అన్ని భాషల్లోనూ బ్యాన్ చేయాలని కేంద్ర హోం మంత్రికి లేఖ రాస్తానని ఆయన వెల్లడించారు.
బిగ్ బాస్‌ను బ్యాన్ చేయండి: బిజెపి ఎంఎల్ఎ రాజాసింగ్
- Advertisement -
- Advertisement -
- Advertisement -