- Advertisement -
కాంగ్రెస్ ప్రభుత్వంపై గోషమహాల్ బీజేపీ ఎంఎల్ఎ రాజాసింగ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక తెలంగాణ రాష్ట్రం లంచాల అడ్డాగా మారిందని దుయ్యబట్టారు. ఈ మేరకు ఆయన వీడియో రిలీజ్ చేశారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో అధికారులు విపరీతంగా తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో కొందరు పోలీసులు లంచాలు తీసుకోవడం అలవాటుగా మార్చుకున్నారని.. పోలీసుల ఛాంబర్లలో కూడా సీసీ కెమెరాలు పెట్టాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.
కరీంనగర్ జమ్మికుంట సీఐ రవి కుమార్ ఒక బాధితుడి నుండి రూ.3 లక్షలు లంచం తీసుకున్నాడని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. గతంలో షాహినాజ్ గంజ్ పోలీసు స్టేషన్ సీఐ బాబు చౌహన్ ఒక వ్యక్తిని కేసు నుండి తప్పించడానికి లంచం అడిగాడని.. లంచాలు అడిగే పోలీసులను ఉద్యోగాల నుండి టర్మినేట్ చేయాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.
- Advertisement -