Thursday, December 26, 2024

రాజాసింగ్‌కు వ్యతిరేకంగా ఫ్లెక్సీల కలకలం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గోషామహల్ ఎంఎల్‌ఎ రాజాసింగ్‌కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కలకలం సృష్టించాయి. రాజాసింగ్ 1000 కోట్లు ఖర్చు పెట్టి 1000 సార్లు పొర్లు దండాలు పెట్టిన ప్రజలు ఓట్లు పడయని పోస్టర్లలో ఉన్నాయి. గోషామహల్‌లోని కోఠి, అబిడ్స్, ఎంజె మార్కెట్, సిబిఎస్, జుమెరాత్ బజార్ ప్రధాన చౌరస్తాలలో బిఆర్ఎస్ నేత గడ్డ శ్రీనివాస్ యాదవ్ పేరు మీద ఫ్లెక్సీలు వెలిశాయి. రాజాసింగ్ తొమ్మిది సంవత్సరాల నుంచి గోషామహల్‌కు ఏం చెశారో చెప్పాలని నిలదీశారు. హిందుత్వం, మతం పేరు పెట్టుకొని రాజాసింగ్ రాజకీయం చేస్తున్నాడని మండిపడ్డారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి స్పీచ్ ఇవ్వడంతో పాటు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రాజకీయ పబ్బం గడుపుతున్నారని దుయ్యబట్టారు. ప్రజల సమస్యలపై ఆయన ఏనాడు స్పందించకపోవడంతో పాటు సహాయం చేయలేదన్నారు. రాబోయే ఎన్నికలలో రాజాసింగ్ ఇంటికి పంపడం ఖాయమని జోస్యం చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News