Thursday, January 23, 2025

శిక్ష పడిన బీజేపీ ఎమ్‌ఎల్‌ఎపై అనర్హత వేటు

- Advertisement -
- Advertisement -

లక్నో: బాలికపై అత్యాచారం కేసులో బీజేపీ ఎమ్‌ఎల్‌ఎకు కోర్టు జైలుశిక్ష విధించింది. ఈ నేపథ్యంలో దోషిగా తేలిన ఆ ఎమ్‌ఎల్‌ఎపై అనర్హత వేఏటు వేశారు. బీజేపీ పాలిత ఉత్తర ప్రదేశ్‌లో తొమ్మిదేళ్ల కిందట బాలికపై అత్యాచారం చేసిన కేసులో బీజేపీ ఎమ్‌ఎల్‌ఎ రాందులర్ గోవింద్‌ను ఎంపీఎంఎల్‌ఎ కోర్టు దోషిగా నిర్ధారించింది. ఈ నెల 15 న శిక్షలు ఖరారయ్యాయి. 25 ఏళ్లు కఠిన కారాగార శిక్షతోపాటు పది లక్షల జరిమానా పడింది.

ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధించిన చట్టసభ సభ్యుడిని అనర్హుడిగా ప్రకటిస్తారు. ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీకి అనర్హులవుతారు. ఈ నేపథ్యంలో బాలికపై అత్యాచారం కేసులో 25 ఏళ్లు జైలుశిక్ష పడిన బీజేపీ ఎంఎల్‌ఎ రాందులర్‌గోండ్‌ను అనర్హుడిగా ప్రకటించారు. దీంతో ఆయన ఎమ్‌ఎల్‌ఎ సభ్యత్వాన్ని కోల్పోయారు. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో వేర్వేరు కేసుల్లో దోషులుగా తేలిన పలువురు శాసన సభ్యులపై కూడా అనర్హత వేటు పడింది. 2022 అక్టోబర్‌లో సమాజ్‌వాదీ పార్టీ (రాంపూర్ సదర్ సీటు) ఎమ్‌ఎల్‌ఎ ఆజం ఖాన్, బీజేపీకి చెందిన విక్రమ్ సింగ్ సైనీ (ఖటౌలీ ఎమ్‌ఎల్‌ఎ) అనర్హులయ్యారు.

2019లో నమోదైన ద్వేషపూరిత ప్రసంగం కేసులో ఆజం ఖాన్‌కు మూడేళ్లు జైలుశిక్ష, 2013లో జరిగిన ముజఫర్ నగర్ అల్లర్ల కేసులో సైనీకి రెండేళ్ల జైలుశిక్ష విధించడంతో వారిపై అనర్హత వేటు పడింది. ఉన్నావ్ బీజేపీ ఎమ్‌ఎల్‌ఎ కుల్దీప్ సింగ్ సెంగార్ అత్యాచారం కేసులో దోషిగా తేలడంతో 2020 ఫిబ్రవరిలో అసెంబ్లీకి అనర్హుడయ్యారు. అయితే దీనికి ముందే ఆయనను ఆ పార్టీ బహిష్కరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News