Wednesday, January 22, 2025

బీహార్ బీజెపి ఎమ్‌ఎల్‌ఎ రాజీనామా

- Advertisement -
- Advertisement -

BJP MLA Rashmi Varma resigns from her legislature

 

పాట్నా : బీహార్ లోని నర్కటీయగంజ్ నియోజక వర్గం బిజెపి ఎమ్‌ఎల్‌ఎ రష్మీవర్మ తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్లనే రాజీనామా చేస్తున్నానని, తన రాజీనామాను ఆమోదించాలని ఆమె స్పీకర్ విజయ్‌కుమార్ సిన్హాకు ఆదివారం లేఖ రాశారు. 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు. ఆమె రాజీనామాతో అసెంబ్లీలో బిజెపి బలం 73 కి తగ్గింది. ఆమె అకస్మాత్తుగా రాజీనామా చేయడానికి కారణాలేమిటో తెలియడం లేదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News