Saturday, December 21, 2024

త్రిపుర అసెంబ్లీలో బిజెపి ఎంఎల్ఎ బూతు లీల..

- Advertisement -
- Advertisement -

అగర్తలా : త్రిపుర అసెంబ్లీలో ఓ వైపు రాష్ట్ర బడ్జెట్‌పై తీవ్రస్థాయి చర్చ జరుగుతూ ఉండగా బిజెపి ఎమ్మెల్యే జాదవ్ లాల్ నాథ్ తన సెల్‌ఫోన్‌లో పొందుపర్చుకున్న నీలి నగ్నచిత్రాలను చూస్తు గడిపారు. త్రిపురలోని బాగ్‌బస్సా అసెంబ్లీ సీటుకు ప్రాతినిధ్యం వహించే ఈ ఎమ్మెల్యే నాథ్ బూతు చిత్రాలను ఆస్వాదిస్తూ గడిపినట్లు తెలిపే వీడియో ఇప్పుడు సంచలనానికి దారి తీసింది. ఇప్పుడీ వీడియో సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది. సభలో బడ్జెట్‌పై ఓ సభ్యుడు మాట్లాడుతూ ఉండటం, మరో వైపు స్పీకర్ రూలింగ్‌లు వెలువరిస్తూ ఉన్నప్పుడే నాథ్ సెల్‌ఫోన్ తీసి ఈ చిత్రాలను చూడటం, ఆయన వెనుక ఉన్న మరో ఎమ్మెల్యే దీనిని తన సెల్‌ఫోన్‌లో క్లిక్‌మన్పించడం వెంటనే ఇది బయటి ప్రపంచానికి వెళ్లడంతో క్షణాల వ్యవధిలోనే త్రిపుర ఎమ్మెల్యే వీక్షించిన ఈ నగ్న చిత్రం ప్రచారం పొందింది.

ఈ ఎమ్మెల్యే నగ్న చిత్రాల దుమారంతో బిజెపి చిక్కుల్లో పడింది. వివరణ ఇచ్చుకోవాలని ఆయనను ఆదేశించింది. అయితే ఇంతవరకూ ఆయన ఎటువంటి జవాబు ఇచ్చుకోలేదు. ఏం చెప్పలేక తన నివాసానికి జారుకున్నాడని వెల్లడైంది. బహిరంగ స్థలాలలో బిజెపి నేత ఒక్కరు ఈ విధంగా నగ్న చిత్రాలు చూస్తూ దొరికిపోవడం ఇదే తొలిసారి కాదు. 2012లో కర్నాటకలో అప్పటి బిజెపి ప్రభుత్వం హయాంలో ఉన్న ఇద్దరు మంత్రులు రాష్ట్ర అసెంబ్లీలో అశ్లీల చిత్రాలను తమ సెల్‌ఫోన్లలో చూస్తూ గడిపిన వ్యవహారం దుమారానికి దారితీసింది. వీరి రాజీనామాల దాకా వెళ్లింది. అయితే ఎటువంటి తప్పిదం చేయలేదని ఆ తరువాత తేలడంతో ఇద్దరు మంత్రులు లక్ష్మణ్ సవాది, సిసి పాటిల్‌లను తిరిగి పదవుల్లోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News