Monday, December 23, 2024

బిజెపి ఎంఎల్ఎ నివాసంలో యువకుడి ఆత్మహత్య… వీడియో కాల్

- Advertisement -
- Advertisement -

లక్నో: ప్రియురాలితో మనస్పర్థలు రావడంతో బిజెపి ఎంఎల్‌ఎ ఇంట్లో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. శ్రేష్ట తీవారి అనే యువకుడు బిజెపి ఎంఎల్‌ఎ యోగేశ్ శుక్లా దగ్గర పని చేస్తున్నారు. తీవారి గత నాలుగు సంవత్సరాల నుంచి ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు. ఇద్దరు మధ్య మనస్పర్థలు రావడంతో ప్రియురాలికి వీడియో కాల్ చేసి మాట్లాడాడు. ఆమెతో వీడియో కాల్ మాట్లాడుతూ ఉరేసుకున్నాడు. వెంటనే యువతి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకొని డోర్‌ను బలవంతంగా ఓపెన్ చేసి చూడగా అప్పటకే అతడు చనిపోయాడు. ప్రియురాలి ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో పాటు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: మంగళవారం రాశి ఫలాలు(26-09-2023)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News