Monday, December 23, 2024

అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన బిజెపి ఎమ్మెల్యేలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను బీజేపీ ఎమ్మెల్యేలు బహిష్కరించారు. రాష్ట్ర శాసనసభ ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్‌ ఒవైసీ ఎన్నుకోవడాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండిస్తూ అసెంబ్లీ సమావేశాలకు గర్హాజరయ్యారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్‌ ఒవైసీ తాను ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనని శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డితో భేటీ అయి ఈ విషయంపై చర్చించారు. అనంతరం ఈరోజు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు బీజేపీ ఎమ్మెల్యేలు వెల్లడించారు.

మరోవైపు, ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ అధ్యక్షతన తెలంగాణ మూడో అసెంబ్లీ మొదటి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత రాష్ట్ర శాసనసభలో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణం చేయిస్తున్నారు. మెదటగా ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు ప్రమాణం చేశారు. ప్రస్తుతం అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం కొనసాగుతోంది. 51 మంది ఎమ్మెల్యేలు తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News