Monday, December 23, 2024

ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఎంపికపై గవర్నర్‌కు బిజెపి ఎమ్మెల్యేల ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర  ప్రభుత్వం సంప్రదాయం పాటించడం లేదని బిజెపి ఎమ్మెల్యేలు గవర్నర్ తమిళిసైకి ఫిర్యాదు చేశారు. ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ నియామకంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సీనియర్లు ఉన్నప్పటికీ అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్ గా నియమించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీంతోపాటు బిజెపి 8 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేదు.  రాజ్ భవన్‌కు ఎమ్మెల్యేలు శనివారం వెళ్లి వినతి పత్రం సమర్పించారు. అంతకు ముందు ప్రొటెం స్పీకర్‌గా నియమితులైన అక్బరుద్దీన్ ఒవైసీ ఎదుట ప్రమాణం చేయమని ప్రకటించారు. ప్రభుత్వ స్పీకర్ నియమాకం చేపట్టిన తరువాత ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేస్తామని పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News