Monday, December 23, 2024

ఆక్సిజన్ సిలిండర్లతో ఢిల్లీ అసెంబ్లీలోనికి బిజెపి ఎంఎల్‌ఏలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: వాయు కాలుష్య నివారణలో ఢిల్లీ ప్రభుత్వం విఫలమైనందుకు సోమవారం మూడో రోజు సమావేశంలో ప్రతిపక్ష బిజెపి ఎంఎల్‌ఏలు ఢిల్లీ అసెంబ్లీలోకి ఆక్సిజన్ సిలిండర్లు చేతపట్టుకుని ప్రవేశించారు. సిలిండర్లు చేతపట్టుకుని వచ్చిన వారిలో ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్షనాయకుడు విజేందర్ గుప్తా, రామ్‌వీర్ సింగ్ బిద్‌గురి, ఓపి శర్మ, అభయ్ వర్మ ఉన్నారు. సిలిండర్‌లు పట్టుకురావడమే కాదు, వారు ఆక్సిజన్ మాస్క్‌లు కూడా పెట్టుకుని వచ్చారు.

‘ఆక్సిజన్ సిలిండర్‌తో నేను రెండు కోట్ల మంది ఢిల్లీ వాసుల వ్యతలను అసెంబ్లీలో లేవనెత్తుతాను. వారంతా గ్యాస్ ఛాంబర్ నిర్బంధంలో జీవిస్తినట్లున్నారు. ఢిల్లీని కాలుష్య రహితం చేస్తానన్న ఆప్ ప్రభుత్వం అది చేసి చూయించాలి’ అని గుప్తా ట్వీట్ చేశారు. నేడు ఢిల్లీ పొంగతో ఆవృతమై ఉంది. ప్రజలు గాలి పీల్చుకోలేక దగ్గుతున్నారు. రోగగ్రస్తులవుతున్నారు. కానీ నిమ్మకు నీరెత్తినట్లు ఆప్ ప్రభుత్వం కూర్చొని చోద్యం చూస్తోంది’ అన్నారు.

ఇదిలా ఉండగా స్పీకర్ రామ్ నివాస్ గోయెల్ సెక్యూరిటీ ఉన్నప్పటికీ వారెలా సిలిండర్లు లోనికి తెచ్చారని ప్రశ్నించారు. సిలిండర్లను దూరం పెట్టమన్నారు. భద్రత లోపించినందున సెక్యూరిటీ సిబ్బందిని తన ఛాంబర్లోకి పిలిపించుకున్నారు. కాగా బిజెపి, ఆప్ ఎంఎల్‌ఏలు లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యంపై వాగ్వాదానికి దిగడంతో సభ వాయిదా పడింది. మూడు రోజులపాటు జరిగిన సమావేశాల్లో కేవలం 10 నిమిషాలే నడిచాయి, పదేపదే వాయిదాపడుతూ వచ్చాయి.

పిల్లల విద్య, టీచర్ల ట్రయినింగ్ విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్ అక్రమంగా జోక్యం చేసుకోవడాన్ని తప్పుపడుతూ ఆప్ శాసనసభ్యుడు సౌరభ్ భరద్వాజ్ చర్చకు డిమాండ్ చేశారు. కాగా ప్రతిపక్ష నాయకుడు రామ్‌వీర్ సింగ్ బిధూరి తన వ్యతిరేకతను తెలుపడమేకాక, లెఫ్టినెంట్ గవర్నర్‌కు అనుకూలంగా వాదించారు. దానికి స్పీకర్ ఆయన లెఫ్టినెంట్ గవర్నర్ ప్రతినిధిలా మాట్లాడుతున్నారని నిందించారు. దాంతో ఆప్ ఎంఎల్‌ఏలు ‘అసెంబ్లీ వెల్ ’లోకి దూసుకొచ్చారు. ఇరుపక్షాల రభసతో సభ మరునాటికి వాయిదా పడింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News