Monday, December 23, 2024

భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న బీజేపీ ఎమ్మెల్యేలు

- Advertisement -
- Advertisement -

భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు ప్రత్యేక సందర్శించారు. అమ్మవారిని దర్శించకుని ప్రత్యేక పూజలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యతోపాటు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. ఈరోజు నుంచి నాలుగు రోజులపాటు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణం చేయించనున్నారు.

మరోవైపు, ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీ ఉంటే తాను ప్రమాణం చేయనని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రకటించారు.  అయితే, మిగతా బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం ప్రమాణానికి మెగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేల నిర్ణయాన్ని కిషన్ రెడ్డి హైకమండ్ కు పంపినట్లు తెలుస్తోంది. హైకమండ్ నిర్ణయం మేరకు బీజేపీ ఎమ్మెల్యేలు ఎదురుచూస్తున్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News