- Advertisement -
హైదరాబాద్ : రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో తనపై నిరాధార, అసత్య ఆరోపణలు చేశారని మంత్రి కెటిఆర్ పంపిన లీగల్ నోటీసుపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. నోటీసులను తాను చట్టపరంగానే ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘రూ.100 కోట్లకు నాపై పరువు నష్టం దావా వేస్తానని మంత్రి లీగల్ నోటీసు పంపారు.
మంత్రి పరువు రూ.100 కోట్లా? మరి యువత భవిష్యత్తుకు మూల్యమెంత? పేపర్ లీకేజీలో నా కుట్ర ఉందని మంత్రి ఆరోపించారు. అలాగైతే మంత్రిపై నేను ఎన్ని కోట్లకు దావా వేయాలి? పేపర్ లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. నష్టపోయిన నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం రూ. లక్ష చొప్పున పరిహారం ఇవ్వాల్సిందే అన్నారు. ఉడత ఊపులకు భయపడమని, నోటీసులను లీగల్‌గానే ఎదుర్కొంటామని ఆయన తెలిపారు.
- Advertisement -