Thursday, January 23, 2025

అక్రమ తవ్వకాలపై ఎన్‌సిపి ఎంఎల్‌సి ఖడ్సేకు రూ.137 కోట్ల జరిమానా

- Advertisement -
- Advertisement -

ముంబై : అనుమతి లేకుండా తమ స్థలంలో అక్రమంగా తవ్వకాలు జరిపారన్న నేరారోపణపై ఎన్‌సిపి ఎంఎల్‌సి ఏక్‌నాథ్ ఖడ్సే, ఆయన కోడలు బీజేపీ ఎంపి రక్షాఖడ్సేలకు ప్రభుత్వ అధికారులు రూ. 137 కోట్ల జరిమానా విధించారు. జలగాన్ జిల్లా ముక్తైనగర్ తాలూకా తహశీల్దార్ ఈమేరకు వారికి అక్టోబర్ 6 న నోటీస్‌లు జారీ చేశారు. 1.18 లక్షల ఖనిజ తునకలు, విలువైన నల్లరాయి తవ్వకాలను ప్రభుత్వ అనుమతి లేకుండా తమ స్థలంలో తవ్వారని నోటీస్‌ల్లో పేర్కొన్నారు. తవ్వకాలు జరిగిన స్థలం ఏక్‌నాథ్ ఖడ్సే, భార్య మందాకిని ఖడ్సే, కుమార్తె రోహిణీ ఖడ్సే, కోడలు రక్షాఖడ్సేలకు చెందినది. 15 రోజుల్లోగా జరిమానా సొమ్ము రూ. 137,14,81,883 చెల్లించాలని నోటీస్‌లో హెచ్చరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News