Sunday, December 22, 2024

రాజకీయ బాధ్యతలనుంచి నన్ను తప్పించండి: గౌతమ్ గంభీర్ విన్నపం

- Advertisement -
- Advertisement -

మనసులో ఏదీ దాచుకోకుండా మొహంమీద చెప్పేయడం మాజీ క్రికెటర్, ఎంపీ గౌతమ్ గంభీర్ కు అలవాటు. ఆయనలో దేశభక్తి ఉట్టిపడుతూ ఉంటుంది. ముఖ్యంగా పాకిస్తాన్ క్రికెటర్ల మీద ఒంటికాలిమీద లేస్తూ ఉంటాడు. క్రికెట్ నుంచి రిటైరయ్యాక, రాజకీయాల్లోకి ప్రవేశించి బిజేపి టికెట్ పై ఎంపీగా గెలిచి పార్లమెంటులోకీ అడుగుపెట్టాడు. అయితే ఐపీఎల్ లో కీలకపాత్ర వహిస్తూ, క్రికెట్ లోనూ తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా గౌతమ్ గంభీర్ చేసిన ట్వీట్ ఒకటి వైరల్ అవుతోంది.

తనను రాజకీయ బాధ్యతలనుంచి తప్పించాలంటూ బీజేపి అధ్యక్షుడు నడ్డాను కోరినట్లు గంభీర్ తెలిపాడు. క్రికెట్ లో ముందుగా ఒప్పుకున్న బాధ్యతలను సజావుగా నిర్వర్తించేందుకు వీలుగా తనను రాజకీయ బాధ్యతలనుంచి  తప్పించాలని ఆయన కోరాడు. ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని తనకు కల్పించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి, హోమ్ మంత్రి అమిత్ షాకు గంభీర్ కృతజ్ఞతలు తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News