Monday, January 20, 2025

ప్రియాంక గాంధీకి బహుమతిగా ‘1984’ బ్యాగ్ అందజేసిన బిజెపి ఎంపి..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా పలువిషయాలపై ప్రతిపక్షాలు నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ.. మోడీ, అదానీలు కలిసి ఉన్నట్టుగా ముద్రించిన బ్యాగులు, పాలస్తీనా అని రాసి ఉన్న బ్యాగులు, బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులను ఖండిస్తున్నట్టు సందేశం ఉన్న బ్యాగులను వెంట తీసుకు వచ్చి నిరసన తెలుపుతున్నాయి.

ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ అపరాజితా షడంగి, ప్రియాంక గాంధీకి ‘1984’ అని ఎరుపు రంగుతో రాసి ఉన్న బ్యాగులను అందించడం ప్రాముఖ్యం సంతరించుకుంది. దీనికి సంబంధించిన వీడియోను బీజేపీ ఎంపీ అపరాజితా షడంగి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కోట్‌ను జత చేశారు. అందులో “ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకకు బ్యాగులంటే చాలా ఇష్టం. అందుకే ఆమెకు ‘1984’ నాటి సిక్కుల ఊచకోతకు సంబంధించిన బ్యాగు అందజేశాను. తొలుత దాన్ని తీసుకోవడానికి ఆమె నిరాకరించినా, తర్వాత తీసుకొని పక్కన పెట్టేశారు. ” అని రాసుకొచ్చారు. గత 50 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ఏం చేసిందో నేటి తరానికి తెలియాలనే ఉద్దేశంతో తనబ్యాగును బహూకరించానని ఆమె పేర్కన్నారు.

1984లో ఏం జరిగింది?
ఇందిరాగాంధీ హయాంలో ‘ ఆపరేషన్ బ్లూస్టార్ ’ జరిగిన నాలుగు నెలలకే (1984 అక్టోబర్ 31న) ఇద్దరు సిక్కు బాడీ గార్డుల తుపాకీ కాల్పులకు ఇందిర బలయ్యారు. దీంతో ఈ హత్యకు ప్రతీకారంగా ఢిల్లీ లోని గురుద్వారాపై కొందరు మూకదాడులకు పాల్పడి నిప్పు అంటించారు. ఈ దాడుల్లో బాదల్ సింగ్, ఠాకూర్ సింగ్, గురుచరణ్ సింగ్ అనే ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. కాంగ్రెస్ సీనియర్ నేత జగదీష్‌టైట్లర్ ప్రజలను రెచ్చగొట్టి , ఈ దాడులకు ఉసిగొల్పారనే ఆరోపణలు వచ్చాయి. అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు సిక్కు ల ఊచకోతకు దారి తీశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News