Sunday, January 19, 2025

పుణే ఎంపి గిరీశ్ బాపట్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

పుణె: బిజెపి సీనియర్ నేత, పుణె ఎంపి బాపట్ బుధవారం ఓ ఆసుపత్రిలో కన్నుమూశారు. గత ఏడాదిన్నరగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. 72ఏళ్ల బిజెపి నేత దీన్‌నాథ్ మంగేష్కర్ ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్య క్షీణించడంతో ఆయనను ఐసియులో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గిరీశ్ కన్నుమూతపై బిజెపి సంతాపం వ్యక్తం చేసింది.

ఈ సందర్భంగా పుణె అధ్యక్షుడు ములిక్ మాట్లాడుతూ మహారాష్ట్ర అభివృద్ధికి గిరీశ్ ఎనలేని కృషి చేశారని, పుణె నగరం ఉన్నతస్థాయిలో ఉండాలని కోరుకునేవారన్నారు. కాగా గిరీశ్ బాపట్ కస్బాపేట్ నియోజకవర్గం నుంచి ఐదుపర్యాయాలు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2019లోక్‌సభ పుణే నుంచి పోటీ చేసి ఎంపిగా గెలుపొందారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News