Monday, December 23, 2024

సిఎం కెసిఆర్‌పై ఎంపి లక్ష్మణ్‌ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బాటసింగారంలో డబుల్ బెడ్‌రూం ఇళ్లను పరిశీలించేందుకు వెళుతున్న కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితోపాటు ఎమ్మెల్యే రఘునందన్‌రావును పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు. బాటసింగారంలో అక్రమాలు జరగడం వల్లే వెళ్లనీయడం లేదని లక్ష్మణ్ ఆరోపించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని సైతం అరెస్ట్ చేయడం దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామిక పాలన జరగడం లేదంటూ విమర్శించారు. కెసిఆర్ సర్కార్ కి రోజులు దగ్గరపడ్డాయని ఆయన ఫైర్ అయ్యారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన కిషన్ రెడ్డి బాటసింగారంకు బయలు దేరారు. మధ్యలోనే పోలీసులు అడ్డుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News