Wednesday, January 22, 2025

11 లక్షల ఓట్ల మెజార్టీతో బిజెపి అభ్యర్థి విజయం

- Advertisement -
- Advertisement -

లోక్‌సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌కు చెందిన ఇండోర్ లోక్‌సభ స్థానంలో బిజెపి అభ్యర్థి శంకర్ లల్వాణీ 11 లక్షల 75వేల 092 ఓట్ల రికార్డు మెజార్టీతో విజయం సాధించారు. లాల్వాణీ తర్వాత రెండో స్థానంలో నోటాకు 2లక్షల 18వేల 674ఓట్లు పోలవ్వడం గమనార్హం. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఇదే లోక్‌సభ ఎన్నికల్లో మరో ఆరుగురు అభ్యర్థులు 5 నుంచి 7లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలిచారు. అందులో నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి కూడా ఉన్నారు. ఆయన 5, 59,906 ఓట్లతో గెలుపొందారు.

కాగా, 1952 నుంచి మొదలుకొని దేశ లోక్‌సభ ఎన్నికల చరిత్రలో లల్వాణీ సాధించినదే అత్యధిక మెజార్టీ కావడం గమనార్హం. అంతకుముందు వరకు అత్యధిక మెజార్టీ రికార్డు మహారాష్ట్రకు చెందిన ప్రీతమ్ ముండే పేరిట ఉంది. తన తండ్రి దివంగత కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే రోడ్డు ప్రమాదంలో మరణించడంతో మహారాష్ట్రలోని బీడ్ లోక్‌సభ స్థానానికి 2014లో జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన కూతురు ప్రీతం ముండే ఈ ఎన్నికల్లో 6,96,321 ఓట్ల ఆధిక్యతతో గెలిచి లోక్‌సభ ఎన్నికల్లో సరికొత్త రికార్డును నమోదు చేసింది. ఆమె సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శంకర్ రావు పాటిల్ 2,24,678 ఓట్లు మాత్రమే పొందారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News