Monday, November 18, 2024

ఫోన్‌ట్యాపింగ్‌పై కెటిఆర్ మాట్లాడటం హాస్యాస్పదం: లక్ష్మణ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఫోన్‌ట్యాపింగ్‌పై సిబిఐ విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతున్నామని బిజెపి ఎంపి లక్ష్మణ్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫోన్‌ట్యాంపిగ్‌కు మూలకారకులు బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అని ఆరోపణలు చేశారు. ఫోన్‌ట్యాపింగ్ విషయంలో పాత్రదారులు కాదని, సూత్రదారులు బయటకు తీసుకరావాలని డిమాండ్ చేశారు.

రాజకీయ లబ్ధి కోసమే కెసిఆర్ ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. తెలంగాణ సంపద దోచుకున్నవారికి శిక్ష పడాలని ప్రజలు కోరుకుంటున్నారని, ఒకటో, రెండో ఫోన్‌ట్యాపింగ్‌లు జరిగితే జరగవచ్చని కెటిఆర్ అంటున్నారని, ఫోన్‌ట్యాపింగ్‌పై కెటిఆర్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. నియంతృత్వాన్ని నమ్ముకున్న వాడు నీడను కూడా నమ్మడని, కెసిఆర్ కూడా ఎవరినీ నమ్మలేదని, అందుకే కెసిఆర్ రాజకీయ, మీడియా ప్రముఖుల ఫోన్ ట్యాపింగ్ చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్‌ట్యాపింగ్ చేయాలంటే కేంద్రహోంశాఖ అనుమతి కావాలని, కెసిఆర్ నియంతృత్వ పోకడలను ప్రజలు గమనించి ఓడించారని చురకలంటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News