Monday, January 20, 2025

గ్యాస్ ధరల తగ్గింపుపై రాజకీయాలు సరికాదు: ఎంపి లక్ష్మణ్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ఇండియా కూటమి ఒక మిథ్య అని బిజెపి ఎంపి లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. శుక్రవారం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. ఇండియా కూటమికి ఒక నాయకుడు, ఒక ఎజెండా లేదని, అభివృద్ధి విరోధులంతా ఇండియా కూటమిగా ఏర్పడ్డారని దుయ్యబట్టారు. అవినీతి, కుటుంబ పార్టీలన్నీ ఏకమయ్యాయని, గ్యాస్ ధరల తగ్గింపుపై రాజకీయలు సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ స్పెషల్ సెషన్స్‌లో పెండింగ్ బిల్లులు తీసుకొస్తామని, జమిలి ఎన్నికలు, యుసిసి అంశాలను కేంద్రం ప్రతిపాదించిందని, జమిలి ఎన్నికలపై చాలా పార్టీలు మద్దతు తెలిపాయని, ప్రత్యేక సమావేశాలు, ఎజెండాపై ఇంకా సమాచారం రాలేదని లక్ష్మణ్ స్పష్టం చేశారు. దేశ ప్రజల హితం కోసమే ప్రత్యేక సమావేశాలు ఉన్నాయని, ముందస్తుకు వెళ్లే ఆలోచన లేదని తేల్చి చెప్పారు.

Also Read: టికెట్ రేసులో కడియం, రాజయ్యతో సర్పంచ్ నవ్య పోటీ….

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News