Wednesday, January 22, 2025

తెలంగాణలో 3 లక్షల ఉద్యోగాలు ఖాళీ: లక్ష్మణ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత ఆశ పడిందని బిజెపి రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగుల ఆశపై సిఎం కెసిఆర్ నీళ్లు చల్లారని, తెలంగాణలో దాదాపుగా మూడు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ప్రశంసించారు. తెలంగాణ వచ్చాక ఒక్క డిఎస్‌సి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఉద్యోగాలు లేక యువత ఆత్మహత్య చేసుకుంటుందని లక్ష్మణ్ దుయ్యబట్టారు. ఎన్నికల్లో సిఎం కెసిఆర్‌కు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్-బిఆర్‌ఎస ఒక్కటేనని, ఇండియా కూటమిలో బిఆర్‌ఎస్‌ను చేర్చుకోవాలని కాంగ్రెస్ చూస్తోందని, కాంగ్రెస్-బిఆర్‌ఎస్‌ను ఆడించేది ఎంఐఎం అని లక్ష్మణ్ చురకలంటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News