- Advertisement -
కాంగ్రెస్ పై బిజెపి ఎంపి లక్ష్మణ్ తీవ్ర విమర్శలు చేశారు. అయోధ్య రామ మందిరం నిర్మాణాన్ని కాంగ్రెస్ అడుగడుగునా అడ్డుకుందని లక్ష్మణ్ ఫైరయ్యారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యం కారణంగానే పాకిస్థాన్ ఆధీనంలోకి పీవోకే వెళ్లిందని మండిపడ్డారు. డా.బిఆర్ అంబేడ్కర్ ఆశయాలను బిజెపి నెరవేరుస్తుందని ఆయన చెప్పారు.
నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం నిర్వహిస్తున్నామని లక్ష్మణ్ తెలిపారు. రూ.350 కోట్లతో స్ఫూర్తి, దీక్షా కేంద్రాలు నిర్వహిస్తున్నామని.. అంబేడ్కర్ చిత్రపటం పార్లమెంటులో పెట్టి భారతరత్నతో ఆయనను గౌరవించామని చెప్పారు.
అంబేడ్కర్ సేవలు, త్యాగాలు భావితరాలకు అందించేందుకు బిజెపి కృషి చేస్తుందని లక్ష్మణ్ అన్నారు.
- Advertisement -