Thursday, September 19, 2024

మోడీ పాలనను రాహుల్ గాంధీ జీర్ణించుకోలేకపోతున్నారు:ఎంపి లక్ష్మణ్

- Advertisement -
- Advertisement -

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాలన, దేశాభివృద్ధిని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఆయన కుటుంబం జీర్ణించుకోలేకపోతోందని బిజెపి ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. ప్రధాని మోడీ వంద రోజుల పాలన కేవలం ట్రైలర్ మాత్రమేనని, వంద రోజుల పాలనపై మేము చర్చకు సిద్ధం, మీరు సిద్ధమా..? అని బిఆర్‌ఎస్-, కాంగ్రెస్ పార్టీలకు సవాల్ చేశారు. బుధవారం ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ వరుసగా మూడు సార్లు బిసి నేత ప్రధాని కావడం మోడీ ఘనత అని అన్నారు. గత వందరోజుల్లోనే చారిత్రక, వికసిత భారత్ దిశగా నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు.

ఆరు గ్యారంటీల పేరుతో మూడు రాష్ట్రాల్లో గెలిచిన కాంగ్రెస్ ప్రజలను వంచిస్తోందన్నారు. వికసిత భారత్ సంకల్ప రోడ్ మ్యాప్ దిశగా మోడీ పాలన సాగుతోందని అన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే విధంగా రైతులకు పెద్ద పీట వేశారని తెలిపారు. నేషనల్ హైవేలు, రైల్వే లైన్లు, ఓడ రేవులు నిర్మాణం వంద రోజుల్లో చేపట్టామని అన్నారు. 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్స్‌కు ఆయుశ్మాన్ భారత్ వర్తింపు జరుగుతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో 75 వేల సీట్లు పెంచామని పేర్కొన్నారు. పేపర్ లీకేజీ నివారణకు కొత్త చట్టం తీసుకొచ్చామని లక్ష్మణ్ వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News