Thursday, January 23, 2025

బిజెపి ఎంపి సోదరుడు సింహా అరెస్టు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : కర్నాటకలో బిజెపి ఎంపి ప్రతాప్ సింహా సోదరుడు విక్రం సింహాను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. విక్రం రాష్ట్రంలోని హస్సన్ జిల్లాలో అనుమతి లేకుండా 126 చెట్లను నరికివేయడం, గ్రామాలలో కలప అక్రమ రవాణాకు పాల్పడుతున్నారనే అభియోగాలు నమోదు అయ్యాయి. వ్యవస్థీకృత నేరాల అదుపు పోలీసు సిఐడి బృందం ఈ వ్యవహారంలో ఆయనను అరెస్టు చేసింది. తరువాత ఆయనను అటవీశాఖ కస్టడీకి తరలించారు. ఇప్పుడు ఆయన అటవీ విభాగం వారి కస్టడీలో ఉన్నాడు. బిజెపి ఎంపి ప్రతాప్ సింహా ఇటీవలే పార్లమెంట్‌లో దాడికి పాల్పడ్డ ఇద్దరు ఆగంతకులకు విజిటర్స్ పాస్‌లు జారీ చేసి పతాకశీర్షికలకు చేరాడు.

హసన్ జిల్లాలోని నందగొండనహళ్లి గ్రామంలో చెట్ల నరికివేత, అక్రమ రవాణాలకు దిగుతున్నారని ఆయనకు వ్యతిరేకంగా అటవీశాఖ అధికారులు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. ఇటీవలే స్థానిక ఎంఆర్‌ఒ మమత గ్రామానికి వెళ్లారు. అక్కడ ఈ అక్రమాల గురించి తెలిసివచ్చింది. దీనితో వ్యవహారంపై అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనితో ఇది దర్యాప్తు క్రమంలో కేసుకు దారితీసింది. అత్యంత పురాతనమైన చెట్లను ఎంపి సోదరుడు నరికివేయించారని , ఇది అటవీ పరిరక్షణ చట్టం, చెట్ల పరిరక్షణ చట్టాల ప్రకారం నేరం అని రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే తెలిపారు. ఎవ్వరైనా చట్టానికి అతీతులు కారని, తగు విధమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News