Monday, January 20, 2025

రెజ్లర్ల ఫిర్యాదుపై చర్యలు ఉండాల్సిందే: బిజెపి ఎంపి

- Advertisement -
- Advertisement -

 

ఔరంగాబాద్: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, బిజెపి ఎంపి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండు చేస్తున్న మహిళా రెజ్లర్లకు అనూహ్యంగా ఒక బిజెపి మహిళా ఎంపి నుంచి మద్దతు లభించింది. మహారాష్ట్రలోని బీడ్ లోక్‌సభ ఎంపి ప్రీతమ్ ముండే బుధవారం బీడ్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఏ మహిళ ఫిర్యాదు చేసినా పోలీసులు దాన్ని పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుందని చెప్పారు.

ముండు ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న తర్వాత అందులోని నిజానిజాలను ఆ తర్వాత పోలీసులు దర్యాప్తు చేయాలని ఆమె తెలిపారు. బ్రిజ్ భూషణ్ విషయంలో కూడా పోలీసులు చర్యలు తీసుకుంటారని తాను ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు.

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్న మహిళా రెజ్లర్లపై పోలీసులు ఇటీవల వ్యవహరించిన తీరును గురించి విలేకరులు ప్రశ్నించగా తాను ఒక ఎంపిగా కాక ఒక మహిలగా మాట్లాడుతున్నానని, ఏ మహిల ఫిర్యాదు చేసినా పోలీసులు ముందుగా దాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ప్రీతమ్ అన్నారు. అందులోని నిజానిజాలను నిర్ధారించుకున్న తర్వాత తదుపరి చర్యలు తీసుకోవలసి ఉంటుందని ఆమె అన్నారు.

అసలు ఫిర్యాదునే పరిగణనలోకి తీసుకోకపోవడం ప్రజాస్వామ్యంలో మంచిది కాదని ఆమె అన్నారు. ఇప్పుడు ఈ కేసు అంతర్జాతీయ స్థాయి పరిగణనలోకి వెళ్లిపోయిందని, దీనిపై విచారణ కమిటీని తాను కోరితే అది పబ్లిసిటీ స్టంగ్‌గా భావిస్తారని ఆమె వ్యాఖ్యానించారు. ఈ కేసులో చర్యలు ఉంటాయని తాను భావిస్తున్నానని ఆమె తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News