Saturday, November 23, 2024

రైతులను కాదంటే ఇంతేసంగతులు

- Advertisement -
- Advertisement -
BJP MP Varun Shares Clip of Vajpayee Speech
బిజెపికి వరుణ్ వాజ్‌పేయి వీడియో చురక

న్యూఢిల్లీ/లక్నో: బిజెపి ఎంపి వరుణ్‌గాంధీ గురువారం బిజెపిని ఇరకాటంలోకి నెట్టే కీలక వీడియోను నెట్‌లో పెట్టారు. రైతులను దెబ్బతీసే నిర్ణయాలకు దిగితే ప్రభుత్వాలకు పుట్టగతులు ఉండవని మాజీ ప్రధాని , బిజెపి దిగ్గజం దివంగత నేత వాజ్‌పేయి చెప్పిన మాటలతో కూడిన పాత వీడియోను వెలుగులోకి తీసుకువచ్చారు. యుపిలో రైతులపై హింసాకాండను ఖండించిన ఈ బిజెపి ఎంపి ఆ తరువాతి దశలో బిజెపి జాతీయ కార్యవర్గ కమిటీ సభ్యుడి హోదాను కొల్పొయ్యారు. అయినప్పటికీ వరుణ్ ఇప్పుడు ఈ వీడియో వెలుగులోకి తెచ్చారు. 1980 సంవత్సరం నాటి తేదీ లేకుండా ఉన్న ఈ వీడియోలో అప్పటి ప్రతిపక్ష నేత వాజ్‌పేయి అప్పటి ఇందిరా గాంధీ ప్రభుత్వంపై మండిపడుతున్న అంశం ఉంది. సర్కారు రైతులను అణచివేస్తోంది, వారిని అనేక రకాలుగా బెదిరిస్తూ భయభ్రాంతులను చేస్తోందని, ఇటువంటి చర్యలకు దిగడం

అనుచితం అని, రైతుల వ్యతిరేక చర్యలకు దిగితే ప్రభుత్వాలు కూలుతాయని వాజ్‌పేయి హెచ్చరించిన అంశం ఇందులో ఉంది. ప్రభుత్వ బెదిరింపులకు రైతులు బెదిరేది అంటూ ఉండదు. రైతుల ఉద్యమాన్ని ఎవరూ రాజకీయాలకు వాడుకోరాదని వాజ్‌పేయి పేర్కొనడం ఇందులో ఉంది. ‘రైతుల స్వచ్ఛమైన డిమాండ్లకు మద్దతు ఇస్తాం. అయినా సర్కారు రైతులను, ప్రతిపక్షాలను భయపెట్టాలని చూస్తే , లేదా చట్టాలను దుర్వినియోగపరిస్తే , రైతుల శాంతియుత ఉద్యమాన్ని పట్టించుకోకపోతే ,ప్రతిపక్షాలు కూడా రైతుల ఉద్యమంలో బలీయ రీతిలో భాగం అయి తీరుతాయి’ అని వాజ్‌పేయి ఈ వీడియోలో చెప్పారు. వాజ్‌పేయి సందేశపు వీడియోపై వరుణ్ గాంధీ తమ స్పందనను వెలువరించారు. ‘అత్యంత విజ్ఞత విచక్షణాయుత మాటలు . పెద్ద మనస్సున్న నేత పలికిన మాటలు’ అని వరుణ్ గాంధీ తమ సందేశం వెలువరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News