- Advertisement -
నందిపేట: నిజామాబాద్‌లో బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపి అరవింద్‌లకు షాక్ తగిలింది. బిజెపి నంది పేట ఎంపిటిసి అరుణ టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. బండి సంజయ్ పర్యటించిన 24 గంటల్లోనే నందిపేట ఎంపిటిసి పార్టీ మారారు. రాజకీయ లబ్ధికోసమే తమ గ్రామాల్లో బిజెపి పర్యటించారని నందిపేట రైతులు మండిపడుతున్నారు. పసుపు బోర్డు పేరుతో గెలిచిన ఎంపి అరవింద్ రైతులను మోసం చేస్తున్నారని ఆగ్రహించారు. వచ్చే ఎన్నికల్లో బిజెపికి డిపాజిట్ కూడా రాదని రైతులు తేల్చారు.
- Advertisement -