Tuesday, January 21, 2025

రాబోయేది రైతు ప్రభుత్వమే

- Advertisement -
- Advertisement -

‘తలాపున పారుతోంది గోదారి.. నా చేను చెలక ఎడారి’ అని పాటలు రాసిన గొప్ప మేధావులు ఉన్నారు. వారంతా ఆలోచించాలి. సమాజాన్ని చైతన్య పరచాలి. మేధావులకు, కళాకారులకు దండం పెట్టి చెబుతున్నా. పెద్దపల్లి చైతన్యం ఉన్న గడ్డ. సింగరేణి కార్మిక లోకం కన్నెర్ర చేసి పిడికిలి ఎత్తాలి. అందరం కలిసి వచ్చే ఎన్నికల్లో బిజెపిని అడ్రస్ లేకుండా చేయాలి. అందుకు సిద్ధపడాలి. ముందుకు కదలాలి. అప్పుడే ఈ దేశాన్ని కాపాడగలుగుతాం. 

                                                                                                 ముఖ్యమంత్రి కెసిఆర్

బిజెపి ముక్త్ భారత్ మనందరి లక్షం

పొలాల్లో నీళ్లు పారాల్నా.. లేక పారాల్నా రక్త తరిమికొట్టాలి బిజెపిని పారదోలి..
మోడీకే మీటర్ పెట్టాలి చెప్పులు మోసే వెదవలకు బుద్ధి చెప్పాలి దేశంలోని మొత్తం రైతులు సాగుకు
వాడే విద్యుత్ 20.8 శాతమే దీనికయ్యే ఖర్చు లక్షల కోట్లు కార్పొరేట్ దొంగలకు
దోచిపెట్టినంత సొమ్ము కాదు ఎన్‌పిఎల పేరిట పారిశ్రామికవేత్తలకు 12లక్షల కోట్లు మాఫీ రైతులకు
ఇవ్వడానికి మాత్రం చేతులు రావడం లేదు సింగరేణి ప్రైవేటీకరణను భగ్నం చేయాలి పెద్దపల్లిలోని ప్రతి
పంచాయతీకి రూ.10లక్షలు రామగుండం కార్పొరేషన్‌తో పాటు మూడు మునిసిపాలిటీలకు తలా
రూ.కోటి పెద్దపల్లి కలెక్టరేట్ ప్రారంభించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కెసిఆర్

మన తెలంగాణ/కరీంనగర్ ప్రతినిధి/పెద్దపల్లి, హైదరాబాద్ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని పారదోలి.. రైతు ప్రభు త్వం రాబోతోందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆశాభావం వ్యక్తం చేశారు. బిజెపి పాలనలో దేశం అన్ని రంగాల్లో అధోగతి పా లైందని విమర్శించారు. ప్రధాని నరేంద్రమోడీ చెప్పేవన్నీ సొల్లు, ప చ్చి అబద్దాలు, అన్ని మాటలేనని తీవ్రస్థాయిలో ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఆయన చెప్పే మాటలను దేశ ప్రజలు ఇక విశ్వసించే పరిస్థితి లేదన్నారు. ప్రస్తుత బిజెపి గద్దలు దేశంలోని అన్ని వర్గాల ప్రజలు ఉసురు తీస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి విద్వేష పాలకులను వచ్చే ఎన్నికల్లో దేశం నుంచి తరమికొట్టాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. మన మందరం కలిసి బిజెపి ముక్త భారత్‌ను సాధించుకోవాలన్నారు. అలాగే అందరినీ బాగుచేసే ప్రభుత్వాన్ని కేంద్రంలో ఏర్పాటు చేసుకుందామన్నారు. ఇందుకు శ్రీకా రం మన రాష్ట్రం నుంచే ప్రారంభిద్దామన్నారు.

ఏమైనా రాబోయేది రైతు ప్రభుత్వమేనని ప్రకటించారు. పెద్దపల్లి జిల్లాలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ ప్రాంగణాన్ని సోమవారం సిఎం కెసిఆర్ ప్రా రంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సిఎం మాట్లాడుతూ, ప్రధాని నరేంద్రమోడీపై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఘాటైన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ మోడల్ అని చెప్పి ఈ దేశాన్ని బిజెపి ప్రభుత్వం పచ్చి మోసం చేసిందని కెసిఆర్ ధ్వజమెత్తారు. ఎనిమిదేళ్లుగా రీతిలో అబద్ధాలు చెప్పుకుంటూ మోడీ కాలాన్ని సాగదీశారన్నారు. ఆయన అసమర్థ పాలన కారణంగానే ప్రస్తుతం దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్భణం విలయతాండవం చే స్తున్నాయి. దేశ ఆర్థిక విలువ దిగజార్చి.. రూపాయి విలువను పూ ర్తిగా పతనం చేశారని ధ్వజమెత్తారు. మోడీకి పాలనపై కంటే బిజెపియేతర ప్రభుత్వాలను కూల్చడం, ఆ ప్రభుత్వాలను అస్థిరపరచడంపైనే దృష్టి సారిస్తున్నారన్నారు. ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిచ్చే ఇలాంటి అసమర్థ ప్రధానిని తాను ఇప్పటి వరకు చూడలేదని కెసిఆర్ భగభగ మండిపడ్డారు.

మోడీ హయంలో ఏ రంగమైన అభివృద్ధి సాధించింది ఉందా? అని నిలదీశారు. అభివృ-ద్ధిని పక్కనపెడితే దేశంలో రోజురోజుకు పరిస్థితులు మరింతగా దిగజారుతున్నాయన్నారు. నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. ఇదా పాలన అంటే? అని మండిపడ్డారు. వాళ్లకు పాలన చేతకాదు….చేసినోళ్లను చూస్తే ఓర్వరు అని మండిపడ్డారు. పైగా వారికి కళ్లుమంట అని వ్యాఖ్యానించారు. మోడీ సాధించింది ఏమిటంటే గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు అడ్డగోలుగా పెంచడమేనని సిఎం కెసిఆర్ ఎద్దేవా చేశారు.

పైగా నీతులు చెబుతూనే లక్షల కోట్ల మేర కుంభకోణాలు చేస్తున్నారన్నారు. అందినకాడకు దోచుకుంటున్నారని ఆరోపించారు. మద్యపానం నిషేధం విధించిన బిజెపి పాలిత రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారిందన్నారు. కల్తీ మద్యంతో 70 మంది మృతికి కేంద్రం జవాబు చెప్పాలని ఈ సందర్భంగా కెసిఆర్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఎం కెసిఆర్ వెంట మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎంపీలు దామోదర్ రావు, వెంకటేష్ నేతకాని, ఎంఎల్‌సిలు టి.భానుప్రసాదరావు, ఎల్.రమణ, పాడి కౌశిక్ రెడ్డి, ఎంఎల్‌ఎలు దాసరి మనోహర్‌రెడ్డి, కోరుకంటి చందర్, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, బాల్క సుమన్, సుంకె రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.

మోడీకే మీటర్లు పెట్టాలి

60 ఏళ్లు కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని కెసిఆర్ అన్నారు. కొట్లాడి సాధించుకున్న రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో పచ్చగా (అభివృద్ధి) చేస్తుంటే….తట్టుకోలేకపోతున్నారన్నారు. అందుకే రాష్ట్రంలో చిచ్చుపెట్టేందుకు యత్నిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో బిజెపి నాయకుల మాట వింటే… మోసపోయి గోసపడుతామన్నారు. దేశంలోని రైతులు సాగుకు వాడే విద్యుత్ 20.8 శాతమేనని తెలిపారు. దేశంలో సాగుకు వాడే విద్యుత్ ఖరీదు రూ.1.45 లక్షల కోట్లు అని సిఎం కెసిఆర్ వెల్లడించారు. ఎన్‌పిఎల పేరుతో కార్పొరేట్ దొంగలకు సుమారు రూ.12 లక్షల కోట్లు దోచి పెట్టారని ఆరోపించారు. కానీ దేశానికి అన్నం పెడుతున్న రైతులను వేధించడానికి మాత్రం వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం చూస్తోందని మండిపట్టారు. మీటర్లు పెట్టాలంటున్న .మోడీకే మీటర్ పెట్టాలని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.

జాతీయ రాజకీయాల్లోకి పోదామా?

నిన్న గాక మొన్న 26 రాష్ట్రాల నుంచి దాదాపు 100 మంది రైతు నాయకులు హైదరాబాద్‌కు వచ్చి తనతో సుదీర్ఘంగా చర్చలు జరపారన్నారు. రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులను చూశారన్నారు. ఈ సందర్భంగా అనేక మంది రైతులతో మాట్లాడనన్నారు. ఈ రాష్ట్రంలో అమలవుతున్న కార్యక్రమాలు మా రాష్ట్రాల్లో అమలు కావడం లేదని వారంతా ముక్తకంఠంతో తనతో చెప్పారన్నారు. అందుకే తనను జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. మన రాష్ట్రంలో రైతులను బాగుచేసుకున్నట్లే దేశవ్యాప్తంగా రైతుల సంక్షేమం కోసం
జాతీయ రాజకీయాల్లోకి పోదామా? అని సభలో ఉన్న జనాలను ఉద్దేశించి కెసిఆర్ ప్రశ్నించారు. ఇందుకు ప్రతిగా సభకు హాజరైన ప్రజలు కెసిఆర్‌కు మద్దతుగా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాల్సిందే…..మోడీ భరతం పట్టాల్సిందే అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.

దొంగల బూట్లూ మోసే సన్నాసులు ఉన్నారు

గాంధీ పుట్టిన గుజరాత్ రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని కెసిఆర్ విమర్శించారు. గాంధీ పుట్టిన రాష్ట్రంలో మద్యపానం నిషేధం చేశామని బిజెపి నాయకులు గొప్పలు చెప్పారన్నారు. పైగా ప్రధాని మోడీ సొంత రాష్ట్రం కూడా అని అన్నారు. ఆ రాష్ట్రంలోనే కల్తీ మద్యానికి 79 మంది బలయ్యారన్నారు. అక్కడ కల్తీ మద్యం ఏరులై పారుతోందన్నారు. దీని మోడీ సమాధానం చెప్పాలా? వద్దా? అని సభకు హజరైన ప్రజలను ఉద్దేశించి అడిగారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు గుజరాత్‌లో కూడా అమలు కావడం లేదన్నారు. ఆ రాష్ట్రంలో దోపిడీ తప్ప మరొకటి లేదని సిఎం ధ్వజమెత్తారు. గుజరాత్‌లో 24 గంటల కరెంటు రాదు, పేదలకు ఆరోగ్య పథకాలు లేవన్నారు. అలాగే పేద వర్గాలకు అక్కడ రూ. 2 వేల పెన్షన్ కూడా ఇవ్వరన్నారు. పైగా స్మశానాల మీద పన్ను, పాలమీద జిఎస్‌టి, చేనేత మీద జిఎస్‌టి విధించి పేద ప్రజలు ఉసురుపోసుకుంటూ లక్షల రూపాయాలను దోచుకుంటున్నారన్నారు. అక్కడి నుంచి వచ్చేటటువంటి గులామ్‌లు, దోపిడీ దొంగల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ఆ దొంగల బూట్లు మోసే సన్నాసులు మన రాష్ట్రంలోనూ కనబడుతున్నారు. వారి పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని సిఎం కెసిఆర్ అన్నారు.

తాను చెప్పే మాటలు వాస్తవాలు…అందుకు వాన చినుకులు

తాను చెప్పే మాటల్లో వాస్తవం ఉందని.. అందుకే వాన చినుకులు పడుతున్నాయని కెసిఆర్ అన్నారు. చెప్పులు మోసే నాయకులు కారు కూతలు కూస్తూ సామాజాన్ని కలుషితం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఇందుకు వ్యతిరేకంగా అందరం కలిసి చేయిచేయి కలపాల్సి ఉందన్నారు. మేధావులకు, కళాకారులకు దండం పెట్టి చెబుతున్నామన్నారు. పెద్దపల్లి చైతన్యం ఉన్న గడ్డ అని అన్నారు. సింగరేణి కార్మిక లోకం కన్నెర్ర చేసి పిడికిలి ఎత్తాలన్నారు. అందరం కలిసి వచ్చే ఎన్నికల్లో బిజెపిని అడ్రస్ లేకుండా చేయాలన్నారు. అందుకు సన్నద్ధపడాలన్నారు. ముందుకు కదలాలన్నారు. అప్పుడే ఈ దేశాన్ని కాపాడగలుగుతామన్నారు. నిద్రాణమై ఉండకుండా మేల్కోని ప్రజలను చైతన్యం చేద్దామన్నారు. మతపిచ్చిగాళ్లు, ఉన్మాదుల నుంచి దేశాన్ని కాపాడుకుందామన్నారు. కూలగొట్టడం అల్కటి పని అన్నారు. కానీ కట్టడం అనేది ఎంతో కష్టమైన పని అని కెసిఆర్ అన్నారు. మతం పేరుతో కొట్లాడుండ్రి అని ఈ దొంగలు చెబుతున్నారు…. వాటిని విందామా? అని ప్రశ్నించారు. మన కాల్వల్లో నీళ్లు పారాలానా…. మతం మంటల్లో నెత్తురు పారాలనా? అని నిలదీశారు.ఈ దొంగల బారిన పడితే ఎలా? చాలా ప్రమాదం ఉందన్నారు.

బిజెపి ముక్త భారత్‌ను ఏర్పాటు చేసుకోవాలని

భారత్‌ను సర్వనాశనం చేసిన బిజెపి నుంచి దేశాన్ని కాడుపాకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సిఎం కెసిఆర్ అన్నారు. అలా అయితేనే దేశాన్ని సకాలంలో కాపాడుకున్నావారం అవుతామన్నారు. ఈ నేపథ్యంలో మేధావులు, బుద్ధి జీవులు, యువకులు నిద్రాణమై ఉండొద్దు అని సూచించారు. వారంతా మేల్కొని బిజెపి మత పిచ్చిగాండ్ల నుంచి దేశాన్ని సురక్షింతగా కాపాడుకుందామని పిలుపునిచ్చారు.

ఆత్మగౌరవంతో ఉందామా? ఢిల్లీకి గులాములవుదామా?

ఆత్మగౌరవంతో ఉందామా? లేక ఢిల్లీకి గులాములవుదామా? అన్న విషయాన్ని ప్రజలే తేల్చుకోవాలని సిఎం కెసిఆర్ అన్నారు. దీనిపై ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలన్నారు. రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనమంటే కేంద్రం కొనదన్నారు. ఇదేమంటే సరైన సమాధానం చెప్పదని కెసిఆర్ తీవర్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. కేంద్రం తెలివి తక్కువ వల్ల బియ్యం, గోధుమలు కూడా మనం దిగుమతి చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు.

పెద్దపల్లి జిల్లా అవుతుందని ఎవరైనా అనుకున్నారా?

రాష్ట్రాన్ని సాధించుకున్న తరువాత పాలనను ప్రజలను ముంగిటకు తీసుకెళ్లాలన్న లక్షంతోనే జిల్లాల సంఖ్యను 10 నుంచి 33కు పెంచుకున్నామన్నారు. అప్పటి వరకు పెద్దపల్లి జిల్లా అవుతుంది అని ఎవరైనా అనుకున్నారా? అని కెసిఆర్ ప్రశ్నించారు. జిల్లాను ఏర్పాటు చేసుకోవడమేకాదు… అద్భుతమైన కలెక్టరేట్ కట్టుకున్నామన్నారు. పేదలు, రైతుల కోసం మనం కలలో కూడా ఊహించనటువంటి మంచి పథకాలు అమలు చేసుకుంటున్నామన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాను అనేకసార్లు పెద్దపల్లికి వచ్చానని అన్నారు. ఇక్కడి సమస్యలపై కూడా పూర్తిగా అవగాహన ఉందన్నారు. అన్ని సమస్యలను క్రమక్రమంగా పరిష్కరించుకుంటూ ముందుకుసాగుతున్నామన్నారు.

ప్రస్తుతం సింగరేణిలో వేల మందికి డిపెండెంట్ ఉద్యోగాలను ఇస్తున్నామన్నారు. సింగరేణి కార్మికులకు దేశంలోనే అత్యధికంగా బోనస్ ఇచ్చుకుంటున్నామన్నారు. కొత్తగా మున్సిపాలిటీలు ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఈ ప్రాంతంలో ఎంతో అభివృద్ధి జరుగుతోందన్నారు. రామగుండంలో మెడికల్ కాలేజీ వస్తదని అనుకున్నమా.. వచ్చిందన్నారు. అలాగే మిషన్ భగీరథతో రాష్ట్రంలోని అన్ని ఇండ్లకూ నీళ్లిస్తమనుకున్నమా? కానీ ఇచ్చామన్నారు.

నా చేను నా చెలక ఎడారి…

శ్రీలంకలో ప్రధానమంత్రి తన దోస్తులకు కంట్రాక్టులిప్పిస్తే.. అక్కడి ప్రజలు “ఇండియన్ పిఎం మోడీ గోబ్యాక్‌” అని నినాదాలిచ్చారని ఈ సందర్భంగా కెసిఆర్ గుర్తు చేశారు. ప్రపంచ దేశాల ముందు దేసం పరువు తీశారని మండిపడ్డారు. ఇదేనా విశ్వ గురువు చేసే పని? అని ధ్వజమెత్తారు. ఇక్కడి గులాములతో బూట్లు మోపించుకోవడమేనా మీరు చేసేదని విమర్సించారు. ‘తలాపున పారుతుంది గోదారి.. నా చేను నా చెలక ఎడారి’ అని పాటలు రాసిన గొప్ప మేధావులున్నారని…వారంతాఆలోచించాలని కెసిఆర్ విజ్ఞప్తి చేశారు.

వరాల జల్లు

పెద్దపల్లి జిల్లాలోని 266 గ్రామపంచాయతీల్లో అభివృద్ధి పనులకు ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్లు సిఎం కెసిఆర్ ప్రకటించారు. అలాగే రామగుండం కార్పొరేషన్‌కు 1 కోటి రూపాయల నిధులిస్తున్నామన్నారు. మరో మూడు మున్సిపాలిటీలకు 1 కోటి రూపాయలు చొప్పున నిధులిలను మంజూరు చేస్తున్నట్లు కెసిఆర్ ప్రకటించారు. ఈ నిధులతో మనకు అవసరమైన అభివృద్ధి పనులు చేసుకుందామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News