Monday, December 23, 2024

హైదరాబాద్ లో మోడీ

- Advertisement -
- Advertisement -

ప్రారంభమైన జాతీయ కార్యవర్గ సమావేశాలు

ఆర్థిక తీర్మానం
ప్రవేశపెట్టిన రక్షణ మంత్రి
రాజ్‌నాథ్, రాజకీయ
తీర్మానం ప్రవేశపెట్టిన
హోం మంత్రి అమిత్
నేడు పరేడ్ గ్రౌండ్‌లో
బహిరంగ సభ

 

n తొలి రోజు ముగిసిన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు
n పాల్గొన్న నడ్డా, అమిత్‌షా

మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్‌లో హెచ్‌ఐసిసి వేదికగా భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు తొలిరోజు ముగిశాయి. సమావేశాల్లో ఆర్థిక తీర్మానం రాజ్‌నాథ్ సింగ్ ప్రవేశపెట్టగా.. రాజకీయ తీర్మానాన్ని అమిత్‌షా ప్రవేశపెట్టారు. శనివారం రాత్రి 9.30 గంటల వరకు వేదిక వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. శనివారం రాత్రి ప్రధాని మోడీ నోవాటెల్ హోటల్‌లో బస చేస్తారు. ఆదివారం రెండోరోజు జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్న అనంతరం ప్రధాని మోడీ ఆదివారం సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్‌లో విజయ సంకల్ప సభకు హాజరవుతారు. ఈ క్రమంలో విజయ సంకల్ప సభ విజయవంతానికి బిజెపి శ్రేణులు ముమ్మర యత్నాలు చేస్తున్నాయి. తొలిరోజు బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలకు మోడీ, అమిత్‌షా, పలువురు కేంద్ర మంత్రులు, బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు హాజరయ్యారు. ప్రధాని మోడీ జ్యోతిప్రజ్వలనతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వందేమాతరం గీతం ఆలపించారు. ప్రధాని మోడీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, కేంద్ర మంత్రి పియూష్ గోయల్ వేదికపై ఆసీనులు అయ్యారు. సమావేశాలు ప్రారంభమైన తర్వాత ప్రధాని మోడీని కిషన్‌రెడ్డి, మాజీ ఎంపి వివేక్‌లు శాలువతో సత్కరించారు.

జెపి నడ్డాను తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణలు సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. పియూష్ గోయల్‌కు మాజీ ఎంపి జితేందర్‌రెడ్డి, ఎంఎల్‌ఎ ఈటల రాజేందర్ శాలువతో సత్కరించారు. ఈ సమావేశాల్లో కేంద్ర మంత్రి అమిత్‌షా, యూపి సిఎం యోగి ఆదిత్యనాథ్, ఇతర బిజెపి ముఖ్య నేతలు దాదాపు 350 మంది హాజరయ్యారు. బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలకు 18 ఏళ్ల తర్వాత హైదరాబాద్ వేదికగా నిలిచింది. తెలంగాణలో అధికారమే లక్షంగా బిజెపి ప్రణాళికలు రచిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా 2024 ఎన్నికలకు పార్టీ శ్రేణులను మోడీ సిద్ధం చేయనున్నారు. పార్టీని సంస్థాగతంగా మరింతగా పటిష్టం చేసే దిశగా ఈ సమావేశంలో చర్చించనున్నారు. తెలంగాణ పాగా వేయడానికి ప్రధాని రోడ్ మ్యాప్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ చేరుకున్న మోడీకి బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో గవర్నర్ తమిళిసై, మంత్రి తలసాని, సిఎస్ సోమేశ్‌తో పాటు పలువురు బిజెపి నేతలు స్వాగతం పలి కారు. తాను హైదరాబాద్ చేరుకున్న విషయాన్ని మోడీ ట్వీట్ చేశారు. ‘బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొనేందుకు డైనమిక్ సిటీ హైదరాబాద్‌లో అడుగుపెట్టాను. ఈ సమావేశంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన పలు అంశాలపై చర్చిస్తాం’ అని మోడీ పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News