Monday, December 23, 2024

బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా తెలంగాణ ట్రిప్ రద్దు!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ(బిజెపి) జాతీయ అధ్యక్షుడు జెపి. నడ్డా శుక్రవారం తెలంగాణకు రావాల్సి ఉండింది. కానీ ఆయన తన ట్రిప్‌ను రద్దు చేసుకున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని అనేక జిల్లాల్లో కొత్తగా కట్టిన పార్టీ కార్యాలయాలను ఆయన ప్రారంభించాల్సి ఉండింది. అంతేకాక ఆయన తెలంగాణకు వచ్చినప్పుడు హైదరాబాద్‌లో జిల్లా పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలతో సమావేశం కావలసి ఉండింది. కాగా ఇప్పుడు నడ్డా పార్టీ కార్యాలయాలను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.

నడ్డా సందర్శన రద్దును బిజెపి తెలంగాణ యూనిట్ గురువారం బాగా చీకటిపడ్డాక ప్రకటించింది. ఈ ఏడాది తెలంగాణ ఎన్నికలు జరుగాల్సి ఉంది. కనుక ఆయన(నడ్డా) సందర్శన చాలా ముఖ్యం అంటున్నారు. కాగా ముఖ్యమంత్రి కెసిఆర్ నుంచి రాష్ట్ర అధికార కళ్లెం లాక్కోవాలని బిజెపి ప్రయత్నిస్తోంది. అందుకు ప్రణాళికలు రచిస్తోంది. భారతీయ రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్)ని  ఏ విధంగానైనా దెబ్బతీయాలనుకుంటోంది.

తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికలు 2018లో జరిగాయి. అప్పుడు బిఆర్‌ఎస్ అద్భుతమైన మెజారిటీని సాధించింది. 119 సీట్లలో 88 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ కేవలం 19 సీట్లకే పరిమితమైంది. కాగా బిజెపి ఒక్క సీటు గెలుచుకుని సరిపెట్టుకుంది. నాటి నుంచి బిజెపి ఎలాగైనా తెలంగాణలో తిష్టవేయాలని కంకణం కట్టుకుంది. అందు కోసం రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు, ప్రచారాలు చేస్తోంది. కానీ బిజెపి దేశవ్యాప్తంగా కార్పొరేటర్లకు కాక ప్రజలకు ఏమి చేసిందన్నది వారు వివరించడంలేదు. అలాంటప్పుడు వారికి ఓట్లు ఎలా పడతాయో వారే చెప్పాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News