Monday, December 23, 2024

మోడీ చిత్రపటానికి బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ పాలాభిషేకం

- Advertisement -
- Advertisement -

ఆరు గ్యారెంటీలతో మరోసారి మోసం : డికె అరుణ

మనతెలంగాణ/ హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు 6 గ్యారెంటీలు అంటూ ప్రకటించడం ప్రజలను మరోసారి మోసం చేయడమే అని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ ఆరోపించారు. మంగళవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఆమె మాట్లాడారు. అంతకుముందు నూతన పార్లమెంటు భవనంలో మహిళా బిల్లు పెట్టినందుకు హర్షం వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి డికె అరుణ పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో మహిళా కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అలవికాని హామీలతో మోసం చేసి అధికారం దక్కించుకోవాలనే కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తోందని అన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో భారత ఖ్యాతి విశ్వవ్యాప్తమవుతుంటే కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని అన్నారు. కాంగ్రెస్ ఇవ్వాల్సిన 3 గ్యారెంటీలు…తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ మారరని.. అధికారంలోకి వస్తే స్కాములుండవని.. తెలంగాణ చరిత్రను తప్పుదారి పట్టియ్యమని.. చెప్పాలని డిమాండ్ చేశారు.సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి, మాజీ మేయర్ బండ కార్తీక, రాష్ట్ర అధికార ప్రతినిధులు విఠల్, రాకేష్ రెడ్డి, సంగప్ప, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజ్యవర్థన్ రెడ్డి, సునీత రెడ్డి పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News