Wednesday, January 22, 2025

పార్లమెంట్ లో టిడిపికి ఉన్న బలం మాకు ఉంది : విజయసాయి రెడ్డి

- Advertisement -
- Advertisement -

అమరావతి: పార్లమెంట్ లో టిడిపికి ఉన్నంత బలం తమకూ ఉందని వైఎస్ఆర్ సిపి ఎంపి విజయసాయి రెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంటు బిజెపికితో వైసిపితో అవసరం ఉందని, టిడిపికి 16 లోక్ సభ సీట్లు మాత్రమే ఉన్నాయని, వైఎస్ఆర్ సిపికి రాజ్యసభలో 11, లోక్ సభలో 4 సీట్లు కలిపి 15 ఉన్నాయని చెప్పారు. వైెఎస్ఆర్ సిపి రాష్ట్రంలో అధికారం కోల్పోయినప్పటికీ పార్లమెంట్ లో తమ బలం తగ్గలేదన్నారు. రాజ్యసభలో బిల్లుల ఆమోదానికి బిజెపికి తమ అవసరం ఉందని గుర్తించాలన్నారు. రాష్ట్ర, దేశ ప్రయోజనాల కోసం పార్లమెంట్ లో ఎన్ డిఎ ప్రవేశ పెట్టే బిల్లులకు మద్దతు ఇస్తామని అని విజయసాయి రెడ్డి వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News