Sunday, March 9, 2025

19 జిల్లాలకు బిజెపి కొత్త అధ్యక్షులు

- Advertisement -
- Advertisement -

0452 అసెంబ్లీ నియోజకవర్గాలకు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు
: జాబితాను ప్రకటించిన తెలంగాణ బిజెపి శాఖ

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించిన రాష్ట్ర బిజెపి నాయకత్వం 19 జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించింది. ఆయా జిల్లాలకు సంబంధించి 52 అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా రాష్ట్ర కౌన్సిల్ సభ్యులను రాష్ట్ర బిజెపి ఎన్నికల అధికారి ఎండల లక్ష్మీనారాయణ సోమవారం అధికారికంగా నియమించారు. త్వరలో మిగిలిన జిల్లాలకు కొత్త అధ్యక్షులను ఎంపిక చేయనున్నట్లు ఆ పార్టీ పేర్కొంది. బిజెపి రాష్ట్ర సంస్థాగత ఎన్నికల సహ అధికారి కె.గీతామూర్తి ఈ విషయాన్ని ఒక ప్రకటనలో తెలిపారు.

బిజెపి తెలంగాణ సంఘటన పర్వ్ 2024 ఎన్నికల నియమావళి ఆధారంగా రాష్ట్ర ఎన్నికల అధికారి ఎండల లక్ష్మీనారాయణ ఈ జిల్లాలకు అధ్యక్షులను, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులను నియమిస్తూ ఆదేశించారని గీతామూర్తి వెల్లడించారు. జిల్లా ఎన్నికల అధికారుల సమక్షంలో ఈ ఎన్నికలు నిర్వహించి ఖరారు చేశామని, ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆమె వెల్లడించారు. కాగా ప్రకటించిన 19 మంది జిల్లా అధ్యక్షులలో ఒక్కరు కూడా మహిళా నేత లేకపోవడం పార్టీ వర్గాల్లో విస్త్రత చర్చ జరుగుతోంది.

జిల్లాల కొత్త అధ్యక్షులు

జనగామ జిల్లాకు- సౌడ రమేష్, వరంగల్-కు గంట రవికుమార్, హన్మకొండకు- కొలను సంతోష్ రెడ్డి, జయశంకర్ భూపాల పల్లికి నిశిధర్ రెడ్డి, నల్గొండ-కి నాగం వర్షిత్ రెడ్డి, నిజామాబాద్‌కి- దినేష్ కులాచారి, వనపర్తికి- దుప్పల్లి నారాయణ, హైదారాబాద్ సెంట్రల్-కి లంకాల దీపక్ రెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి రూరల్-కి బుద్ది శ్రీనివాస్, కొమురం భీమ్ ఆసిఫాబాద్-కి శ్రీశైలం ముదిరాజ్, కామారెడ్డికి- నీలం చిన్న రాజులు, ములుగు-కి సిరికొండ బలరాం, మహబూబ్ నగర్‌కి పి.శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాలకి- రాచకొండ యాదగిరి బాబు, మంచిర్యాలకి- వెంకటేశ్వర్ గౌడ్, పెద్దపల్లికి- కర్రే సంజీవరెడ్డి, ఆదిలాబాద్‌కి- పతంగి బ్రహ్మానంద్, మెదక్-కి వల్దాస్ రాధా మల్లెష్ గౌడ్, మహంకాళి సికింద్రాబాద్‌కి- గుండగోని భరత్ గౌడ్‌లను జిల్లా అధ్యక్షులుగా బిజెపి రాష్ట్ర శాఖ నియమించింది.

నియోజకవర్గాల వారీగా రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు

ఆదిలాబాద్ నియోజకవర్గానికి మురళీధర్ ఠాక్రే, బోధ్ (ఎస్‌టి)కి టి.గంగాధర్ (రాజు), చెన్నూరు (ఎస్‌సి)కి బత్తుల సమ్మయ్య, బెల్లంపల్లి (ఎస్‌సి)కి నగునూరి సుధీర్‌గౌడ్, మంచిర్యాలకు బియ్యాల సతీష్‌రావు, సిర్పూర్‌కు చిప్పకుర్తి శ్రీనివాస్, ఆసిఫాబాద్ (ఎస్‌టి)కి ఆత్రం మనోహర్, ఆర్మూర్‌కి నాగసురేష్, బోధన్‌కు శైలేష్‌కుమార్, నిజామాబాద్ అర్బన్‌కు బి.వరలక్ష్మి, నిజామాబాద్ రూరల్‌కు నేనావత్ ఓంసింగ్, బాల్కొండకు కర్నె లక్ష్మీనారాయణ, జుక్కల్ (ఎస్‌సి) గొనె గంగారాం, బాన్స్‌వాడకు దుర్కి పోశెట్టి, ఎల్లారెడ్డికి మర్రి బాలకిషన్, కామారెడ్డికి విపుల్ జైన్, కోరుట్లకు ఆలేటి నరేందర్‌రెడ్డి, జగిత్యాలకు నలువల తిరుపతి, ధర్మపురి (ఎస్‌సి) కొమ్ము రాంబాబు,

రామగుండంకు సులువ లక్ష్మీనరసయ్య, మంథనికి కొండపాక సత్యప్రకాష్, మెదక్‌కు రాగి రాములు, నర్సాపూర్‌కు కొండల్‌రావు, మేడ్చల్‌కు అచ్చిని నర్సింహ, దేవరకొండ (ఎస్‌టి)కి నాయక్, నాగార్జునసాగర్‌కు జూలకంటి చంద్రశేఖర్‌రెడ్డి, మిర్యాలగూడకు కనపర్తి సత్యప్రసాద్, నల్గొండకు పిండి పాపిరెడ్డి, మునుగోడుకు కంచర్ల గోవర్థన్‌రెడ్డి, నకిరేకల్ (ఎస్‌సి)కి వనం అంజయ్య, మహబూబ్‌నగర్‌కు నాగేశ్వర్‌రెడ్డి, జడ్చెర్లకు ముచ్చర్ల కృష్ణయ్య, దేవరకద్రకు యజ్ఞ భూపాల్‌రెడ్డి, వనపర్తికి గౌని వేమారెడ్డి, పరకాలకు గట్టు కొప్పుల రాంబాబు, వరంగల్ వెస్ట్‌కు రావుల సుదర్శన్, నర్సంపేటకు వడ్డేపల్లి నర్సింహులు, వరంగల్ ఈస్ట్‌కు తాబేటి వెంకట్‌గౌడ్,

వర్థన్నపేట (ఎస్‌సి)కి మరిపెల్లి రామచంద్రరెడ్డి, భూపాలపల్లికి రాయరాకుల మొగిలి, జనగామకు మహేందర్‌రెడ్డి, స్టేషన్‌ఘనపూర్‌కు పెరుమాండ్ల వెంకటేశ్వర్లు, పాలకుర్తికి రచ్చ కుమార్, ములుగు (ఎస్‌టి)కి భూక్యా జవహర్‌లాల్, ముషీరాబాద్‌కు ఆర్.శేషసాయి, సనత్‌నగర్‌కు సురేష్ రావల్, సికింద్రాబాద్‌కు గణేష్ ముదిరాజ్, సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు రాయల్ కుమార్, అంబర్‌పేటకు కేసరి నర్సింగరావు యాదవ్, ఖైరతాబాద్‌కు ఎన్‌డి నగేష్, జూబ్లీహిల్స్‌కు ఏ.శ్రీనివాసులు రెడ్డి, నాంపల్లికి సవారీ అనిల్‌కుమార్‌లను పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా నియమించినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News