Monday, December 23, 2024

కొత్త ముఖాలైనా 42 మంది గెలిచారు

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి కొత్త ముఖాలు కూడా విజయం సాధించాయి. ఈసారి ఎన్నికలలో బిజెపి ఏకంగా 45 మంది కొత్త వారిని పోటీకి దింపింది. అయితే పాతవారి అసంతృప్తి ఇతరత్రా ప్రభావాలు ఏమీ లేకుండా ఈసారి వీరిలో 43 మంది గెలిచారు. కొత్త వారిలో ఇద్దరే ఓడారు. రాష్ట్రంలో అధికార వ్యతిరేకత ఉందనే వాదనను ఆదిలోనే తిప్పికొట్టేందుకు బిజెపి ఈ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సహా పలువురిపై వేటేస్తూ వీరికి సీట్లు ఇవ్వకుండా కొత్త వారికి ఇచ్చారు. గుజరాత్‌లో ఇప్పటికీ 27 ఏండ్లుగా అధికారంలో ఉంటూ వచ్చిన బిజెపి ఈ కొత్తవారిని కూడా తమ విజయపు ఖాతాలోకి చేర్చింది. బొటాడ్, వాఘోడియాలలో కొత్త ముఖాలైన బిజెపి అభ్యర్థులు ఓడారు.

అక్కడ వరుసగా ఆప్, ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచారు. వాఘేడియాలో అధికార బిజెపికి చెందిన ఇంతకు ముందటి ఆరుదఫాల సిట్టింగ్ ఎమ్మెల్యే మధు శ్రీవాత్సవను కాదని బిజెపి అశ్విన్ పటేల్‌కు సీటు ఇచ్చింది. దీనితో శ్రీవాత్సవ బిజెపిని వీడి ఇండిపెండెంటుగా నిలిచారు. అయితే ఇక్కడ ఆయన మరో ఇండిపెండెంట్ చేతిలో ఓడారు. బిజెపి రెండోస్థానంలో నిలిచింది. ఇక బొటాడ్‌లో బిజెపి సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సురభ్ పటేల్‌కు టికెటు ఇవ్వలేదు. ఇక్కడ ఘన్‌శ్యామ్ విరానీకి సీటు ఇచ్చారు. అయితే వీరాని ఇక్కడ ఆప్ అభ్యర్థి చేతిలో కేవలం 2779 ఓట్ల తేడాతో ఓడారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News