Monday, December 23, 2024

అధికారంలోకి రాగానే ఖాళీ ఉద్యోగాల భర్తీ చేస్తాం: బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

వరంగల్: రాష్ట్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకే నిరుద్యోగ మార్చ్ అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సిఎం కెసిఆర్ రావాలి… క్షమాపణ చెప్పాలి.. కెటిఆర్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల 21న పాలమూరులో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామని బండి సంజయ్ ప్రకటించారు. అటు ఖమ్మం జిల్లాలో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామన్నారు. సిట్ విచారణ చేసి చేతులు దులుపుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

Also read: మోహన్ లాల్ ‘మలైకోట్టై వాలిబన్’ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ విడుదల

డ్రగ్స్, నయూం, ఎమ్మెల్యేల వివాదం, మియాపూర్ భూములపై సిట్ విచారణ ఏమైంది? అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఇన్ని జరుగుతున్నా టిఎస్ పిఎస్ సి వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే ఖాళీ ఉద్యోగాల భర్తీ చేస్తామన్నారు. ప్రతి ఏటా జామ్ క్యాలెండర్ విడుదల చేస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు. టిఎస్ పిఎస్ సి కేసులో సిఎం కెసిఆర్ రాజీనామా చేయాలి. బాధిత యువతకు రూ. లక్ష పరిహారం ఇవ్వాలని బండి డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News