Monday, December 23, 2024

రాజకీయాలకు గుడ్‌బై: నితిన్ గడ్కరీ ఏమన్నారంటే

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నాయకుడు నితిన్ గడ్కరీ రాజకీయాలకు గుడ్‌బై చెప్పనున్నారంటూ జోరుగా సాగుతున్న ఊహాగానాలకు బ్రేక్ పడింది. తనకు రాజకీయాలపై ఆసక్తి తగ్గిపోయిందని, తన రాజకీయ జీవితంలో ప్రజలకు ఎంతో సేవ చేశానని, ప్రజలు తనకు ఓటు వేయకపోయినా ఫర్వాలేదని నితిన్ గడ్కరీ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో ఆయన రాజకీయాల నుంచి తప్పుకోనున్నారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి.

గత ఆడివారం నాగపూర్‌లో ఒక అవార్డు ప్రదానోత్సవంలో గడ్కరీ మాట్లాడుతూ నీటి రక్షణ, వాతావరణ మార్పులు, బీడు భూమి ఉపయోగం వంటి రంగాలలో తనకు చాలా ఆసక్తి ఉందని, రాజకీయాల కారణంగా వాటిపై ఎక్కువ సమయం పెట్టలేకపోయానని చెప్పారు. ఇప్పటికే సమయం మించి పోయిందని ప్రజలకు చెప్పేశానని, మీకు నా పట్ల నమ్మకముంటే నాకు ఓటు వేయండని, లేపోతే మీ ఇష్టమని వారికి చెప్పానని ఆయన వ్యాఖ్యానించారు. మస్కా కొట్టడం తనకు చేతకాదని, తనను ఇష్టపడితే తనకు ఓటువేయాలని, లేకపోతే మరో వ్యక్తి తన స్థానంలో వస్తారని గడ్కరీ అన్నారు. నిజానికి తాను ఎక్కువ సమయం వేరే వ్యాపకాలతో గడపాల్సి ఉందని ఆయన చెప్పుకొచ్చారు.

ఈ వ్యాఖ్యలతో గడ్కరీ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం ఉండే నాగపూర్‌కు చెందిన నితిన్ గడ్కరీకి ఆ సంస్థతో దశాబ్దాల అనుబంధం ఉంది. అయితే గత ఏడాది బిజెపి నిర్ణాయక మండలి కేంద్ర ఎన్నికల కమిటీ నుంచి తనను తొలగించి దేవేంద్ర ఫడ్నవీస్‌ను తీసుకురావడంపై గడ్కరీ అసంతృప్తిగా ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇవన్నీ ఉత్త ఊహాగానాలేనని తడ్కరీ తాజా ప్రకటనతో స్పష్టమైంది.

గురువారం మహారాష్ట్రలోని రత్నగిరిలో గడ్కరీ విలేకరులతో మాట్లాడుతూ రాజకీయాల నుంచి తప్పుకునే ఉద్దేశం తనకు తేలదని స్పష్టం చేశారు. మీడియా కథనాలను ఆయన ప్రస్తావిస్తూ ప్రతికా విలేకరులు బాధ్యతయుతంగా వార్తలు రాయాలంటూ హితవు చెప్పారు. తన వ్యాఖ్యలపై సొంత వ్యాఖ్యానాలు చేయవద్దంటూ ఆయన విలేకరులకు చురకలు అంటించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News