Wednesday, November 6, 2024

గోవా సిఎల్‌పి తిరుగుబాటులో బిజెపి ప్రమేయం లేదు : సిఎం సావంత్

- Advertisement -
- Advertisement -

BJP not involved in Goa CLP rebellion: CM Sawant

 

పనజి : గోవా కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీలో ‘తిరుగుబాటు’ తలెత్తిందన్న కథనాలపై బీజేపీ ఆచితూచి స్పందించింది. ఇందులో బీజేపీ ప్రమేయం ఏమీ లేదని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మంగళవారం తెలిపారు. దీనికి ముందు కాంగ్రెస్‌కు చెందిన 11 మంది ఎమ్‌ఎల్‌ఎలలో ఐదుగురు ఎమ్‌ఎల్‌ఎలు ఎక్కడున్నారనే సమాచారం తెలియక పోవడంతో పార్టీలో చీలిక రానుందనే ఊహాగానాలకు తావిచ్చింది. అయితే వారంతా సోమవారం నాడు రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు హాజరయ్యారు. విపక్ష పార్టీ (కాంగ్రెస్) కి వచ్చిన ఇబ్బందేమీ లేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్టీ సీనియర్ నేత ముకుల్ వాస్నిక్ సోమవారం రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో కూడా పదిమంది కాంగ్రెస్ ఎమ్‌ఎల్‌ఎలు పాల్గొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో పరిణామాలపై ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత ప్రమోద్ సావంత్‌ను మీడియా ప్రశ్నించగా, గోవా సిఎల్‌పిలో తిరుగుబాటు వ్యవహారానికి బీజేపీ ప్రమేయం ఏమీ లేదని ముక్తసరిగా సమాధానమిచ్చారు. సీఎల్‌పి మీట్‌కు ఐదుగురు కాంగ్రెస్ ఎమ్‌ఎల్‌ఎలు హాజరు కాలేదని, వారి ఆచూకీ తెలియడం లేదని సమాచారం తెలియగానే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అప్రమత్తమై సీనియర్ నేత ముకుల్ వాస్నిక్‌ను హుటాహుటిన గోవాకు పంపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News