Monday, December 23, 2024

పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ కనుమరుగు: ఎన్వీ సుభాష్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి హవాలో కాంగ్రెస్ కొట్టుకుపోవడం ఖాయమని ఆపార్టీ అధికారి ప్రతినిధి ఎన్వీ సుభాష్ విమర్శించారు. తెలంగాణలో తుమ్మితే ఊడిపోయే కాంగ్రెస్ ప్రభుత్వమని, ఇల్లు అలకగానే పండుగ కాదని, ముందుంది అసలైన పండుగని పేర్కొన్నారు. టిపిసిసి ఉపాధ్యక్షుడు నిరంజన్‌కు మతిస్థిమితం తప్పిందేమోనన్న అనుమానం కలుగుతోందన్నారు. మంగళవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొంటూ కర్ణాటకలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేక చేతులెత్తేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, రేపో మాపో తెలంగాణలో కూడా చేతులెత్తేసే పరిస్థితి ఉందన్నారు.

ఎన్నికలకు ముందు అధికారంలోకి వస్తే రైతులకు పంట పెట్టుబడి సాయం కింద రూ. 15 వేలు వేస్తామన్న కాంగ్రెస్ పార్టీ, ఒక్క రూపాయి తక్కువ వేసినా ఒప్పుకునేది లేదన్నారు. తెలంగాణలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకపోతే ప్రజలే బండకేసి కొడతారని హెచ్చరించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలనే సాధించిందని హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చారని, అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాల్లోనూ హస్తం కనుమరుగైందని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News