కన్యాకుమారి: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ మొదలెట్టినప్పటి నుంచి బిజెపికి సెగ తగులుకున్నట్లు ఉంది. ఆయనని విమర్శించడం పెంచేసింది. తప్పుడు ఆరోపణల ప్రచారం కూడా మొదలెట్టింది. ప్రస్తుతం రాహుల్ గాంధీ ఓ క్రైస్తవ మత గురువుతో భేటీ అయినందుకు కూడా బిజెపి నాయకులు అభ్యంతరకర రీతిలో ట్వీట్లు చేశారు. క్రైస్తం ప్రీస్ట్‌తో రాహుల్ గాంధీ భేటీ కావడంపై బిజెపి నాయకులు చేసిన ట్వీట్లపై కాంగ్రెస్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఏఐసిసి కమ్యూనికేషన్స్ జనరల్ సెక్రటరీ జైరామ్ రమేశ్ బిజెపి వారి ‘హేట్ ఫ్యాక్టరీ’ ట్వీట్లను షేర్ చేస్తూ గాంధీకి అందులోని ఆడియోకి అసలు సంబంధమే లేదని పేర్కొన్నారు. బిజెపి కావాలనే తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. భారత్ జోడో యాత్ర మొదలెట్టినప్పటి నుంచి బిజెపికి కంపరంగా ఉందని కూడా ట్వీట్ చేశారు. మహాత్మా గాంధీ, నరేంద్ర దభోల్కర్, గోవింద్ పన్సారే, ఎంఎం కల్బుర్గీ, గౌరీ లంకేశ్ వంటి వారిని పొట్టనబెట్టుకున్న వారు భారత్ జోడో యాత్రను దెబ్బ తీయాలిని చూస్తున్నారన్నారు.
బిజెపి ప్రతినిధి షెహజాద్ పూణావాలా రాహుల్ గాంధీ, క్రైస్తవ ప్రీస్ట్ వీడియోను షేర్ చేస్తూ “ రాహుల్ గాంధీని కలుసుకున్న జార్జ్ పొన్నయ్య ‘శక్తి(తదితర) దేవతల మాదిరి కాకుండా ఏసుక్రీస్తు ఒక్కడే దేవుడు’ అన్నారు” అన్న వీడియోను షేర్ చేశారు. ఇదివరలో కూడా ఆయన హిందూ ద్వేషాన్ని వెల్లగక్కినందుకు అరెస్టయ్యారన్నారు. ఆయన ఇంకా ‘భారత మాత మలినాలు నాకంటకుండా ఉండేందుకు నేను బూట్లు ధరిస్తుంటాను’ అని పేర్కొన్నట్లు ట్వీట్ చేశారు.
ప్రస్తుతం రాహుల్ గాంధీ 3570 కిమీ. ‘భారత్ జోడో యాత్ర’ నిర్వహిస్తున్నారు. ఆయన దేశవ్యాప్తంగా అనేక మందిని కలుసుకుని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విఫలం కావడం వల్ల బిజెపి ప్రభుత్వానికి అడ్డుఅదుపు లేకుండా పోయింది, ఆడింది ఆట, పాడింది పాటగా ఉంది. బిజెపి ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం కూడా ఎవరూ చేయలేని స్థితిలో దేశం ఉంది.
An atrocious tweet from the BJP hate factory is doing the rounds. It bears no relation whatsoever to what is recorded in the audio. This is typical BJP mischief that has become more desperate after the successful launch of #BharatJodoYatra which is evoking such a huge response.
— Jairam Ramesh (@Jairam_Ramesh) September 10, 2022