Thursday, January 23, 2025

నేను బిజెపిలో చేరాలని దేబురింపు: మనీష్ సిసోడియా

- Advertisement -
- Advertisement -

Manish Sisodia

 

న్యూఢిల్లీ: ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, మద్యం పాలసీ అమలులో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై తనతో పాటు పలువురు ఎక్సైజ్ అధికారులపై నమోదైన కేసుకు సంబంధించి శుక్రవారం సిబిఐ తన ఇంటిపై దాడి చేసింది. పార్టీలో చేరితే కేసులన్నీ ఎత్తివేస్తానందని ఆయన పేర్కొన్నారు. సిసోడియా తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ విషయం తెలిపారు.  “అవినీతిపరులు ,  స్కీమర్ల ముందు తాను తల వంచబోను” అన్నారు.

సిసోడియా, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి గుజరాత్‌లో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు.  ఈ సాయంత్రం హిమత్‌నగర్‌లో టౌన్ హాల్ సమావేశం నిర్వహించనున్నారు. “నేను అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి రెండు రోజుల పాటు గుజరాత్‌కు వెళ్తున్నాను , గత 7-8 సంవత్సరాలలో విద్య, ఆరోగ్యం, ఉపాధి, ద్రవ్యోల్బణంపై పోరులో పని చేసిన విధానం… గత 5 నెలల్లో పంజాబ్‌లో అదే వేగంతో పని జరుగుతోంది. అది చూసి గుజరాత్ ప్రజలు కూడా కేజ్రీవాల్‌కి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు.  నేను కూడా గుజరాత్‌కు రెండు రోజులు వెళ్తాను. 27 ఏళ్లలో గుజరాత్‌కు ఆరోగ్యం, విద్య, ఉపాధి రంగాల్లో బిజెపి ఏమీ చేయలేకపోయిందని వారికి చెబుతాం. ద్రవ్యోల్బణంతో ప్రజలు చితికిపోయారు, ప్రజల కోసం వారు ఏమీ చేయలేదు. అరవింద్ కేజ్రీవాల్‌కు అవకాశం ఇస్తే 27 ఏళ్ల బిజెపి పాలనలో గుజరాత్ ప్రజలు చూడనిది ఐదేళ్లలో చేస్తాం’’ అని సిసోడియా అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News